Leading News Portal in Telugu

Air India to cancel 60 India-US flights in peak season due to aircraft shortage


  • యూఎస్‌కి 60 విమానాలు రద్దు చేసిన ఎయిర్ ఇండియా..

  • పీక్స్ సీజన్‌లో విమానాల కొరత..
Air India: అమెరికాకు 60 విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా.. కారణం ఇదే..

Air India: పీక్ ట్రావెల్ పిరియడ్‌లో ఎయిర్ ఇండియా అమెరికాకు 60 విమాన సర్వీసుల్ని రద్దు చేసింది. నిర్వాహణ సమస్యల కారణంగా, ఎయిర్ క్రాఫ్ట్‌లు అందుబాటులోని కారణంగా ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ మద్య భారత్ – అమెరికా రూట్లలో విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని ఎయిర్ లైన్స్‌కి చెందిన సంబంధిత వర్గాలు తెలిపాయి. శాన్ ఫ్రాన్సిస్కో, చికాగోతో పాటు అమెరికాలోని వివిధ నగరాలకు సర్వీసులు రద్దు అయ్యాయి.

భారీ నిర్వహణ, సప్లై చైన్ పరిమితుల నుంచి కొన్ని విమానాలు తిరిగి రాకపోవడంతో నవంబర్-డిసెంబర్ మధ్య తక్కువ సంఖ్యలో విమానాలు రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. కస్టమర్లకు ఈ మేరకు సమచారం అందించామని, ఎయిర్ ఇండియా గ్రూప్ ద్వారా నడపబడుతున్న ఇతర విమానాల్లో, తర్వాతి రోజులకు సర్వీసుని ఆఫర్ చేసినట్లు సంస్థ తెలిపింది.

“ఎయిర్ ఇండియా నవంబర్ 15 మరియు డిసెంబర్ 31 మధ్య శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్, చికాగో, నెవార్క్ మరియు న్యూయార్క్ నుండి 60 విమానాలను రద్దు చేసింది, ఎందుకంటే ఈ గమ్యస్థానాలకు కొన్ని విమానాలను నడపడానికి తగిన వైడ్ బాడీ ఎయిర్‌క్రాఫ్ట్ లేదు.” అని ఎయిర్ ఇండియా తెలిపింది. ఇందులో భాగంగా ఢిల్లీ-చికాగో రూట్‌లో 14 విమానాలు, ఢిల్లీ-వాషింగ్టన్ రూట్‌లో 28 విమానాలు, ఢిల్లీ-ఎస్‌ఎఫ్‌వో మధ్య 12 విమానాలు, ముంబై-న్యూయార్క్ మార్గంలో నాలుగు విమానాలతో పాటు ఢిల్లీ-నెవార్క్ మార్గంలో రెండు విమానాలను ఎయిరిండియా రద్దు చేసింది.

ఎయిర్ ఇండియా వెయింటనెన్స్ కోసం పంపబడుతున్న ఎంఆర్ఓ ఆపరేటర్ నుంచి విమానాలు అందడంతో ఆలస్యం జరిగింది. సాంకేతిక సమస్యల కారణంగా కొన్ని వైడ్ బాడీ విమానాలు నిలిచిపోయాయి. దీని ఫలితంగా కొరత ఏర్పడింది. ఏయిర్ ఇండియా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో పాటు పూర్తి రీఫండ్‌ని ఆఫర్ చేస్తోంది.