Leading News Portal in Telugu

Electronics company BPLs founder TPG Nambiar passes away


  • బీపీఎల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ వ్యవస్థాపకుడు నంబియార్ కన్నుమూత

  • అనారోగ్యంతో చనిపోయారని కుటుంబ సభ్యుల వెల్లడి
BPL: బీపీఎల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ వ్యవస్థాపకుడు నంబియార్ కన్నుమూత

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బీపీఎల్ ​​వ్యవస్థాపకుడు టీపీజీ నంబియార్(95) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలు కారణంగా గురువారం తెల్లవారుజామున బెంగళూరులోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆరోగ్యం బాగోలేదని.. ఈ కారణం చేతనే నంబియార్ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఈ మేరకు నంబియార్ అల్లుడు, బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ ఎక్స్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. బీపీఎల్ అనేది.. భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ వస్తువుల్లో ఒక బ్రాండ్‌. ఎన్ని కంపెనీలు వచ్చినా.. నేటికీ బీపీఎల్‌కి మంచి ప్రజాదారణ ఉంది.

ఇది కూడా చదవండి: Maharashtra Polls: ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన సీనియర్‌ నేత రవి రాజా

బీపీఎల్ అంటే బ్రిటీష్ ఫిజికల్ లేబొరేటరీస్. నంబియార్ తొలుత యూఎస్, యూకేలో సుదీర్ఘ కాలం పని చేశారు. అటు తర్వాత భారత్‌లో నమ్మకమైన ఉత్పత్తులను అందించాలన్న ఉద్దేశంతో బీపీఎల్ కంపెనీని ప్రారంభించారు. ఎలక్ట్రానిక్స్‌లో బీపీఎల్ అనేది ఒక బ్రాండ్‌గా ముద్రపడింది. గృహోపకరణాలు అంటే ముందుగా గుర్తుకొచ్చేది బీపీఎల్ అంటే అతిశయోక్తి కాదు. 1963లో కేరళలోని పాలక్కాడ్‌లో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం కర్ణాటకలోని బెంగళూరులో ఉంది.

ఇది కూడా చదవండి: Amaran Special Show: ముఖ్యమంత్రి కోసం ‘అమరన్’ స్పెషల్ షో