Leading News Portal in Telugu

Will Fadnavis be Mahayuti CM face of Maharashtra? Posters emerge at state BJP headquarters


  • ముంబైలో పోస్టర్లు కలకలం

  • నవంబర్ 23న ఫడ్నవీస్ రిటర్న్స్ అంటూ బ్యానర్లు
Maharashtra Polls: ముంబైలో పోస్టర్లు కలకలం.. నవంబర్ 23న ఫడ్నవీస్ రిటర్న్స్ అంటూ బ్యానర్లు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు పోస్టర్ల వ్యవహారం ఎన్డీఏ కూటమిలో రాకరేపతున్నాయి. డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌కు సంబంధించిన పోస్టర్లు ముంబైలో కలకలం రేపుతున్నాయి. ముంబై బీజేపీ కార్యాలయం దగ్గర నవంబర్ 23న దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ బ్యానర్లు వెలిశాయి. ‘‘నవంబర్ 23న ఫడ్నవీస్ రిటర్న్స్’’ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఇప్పుడు మహారాష్ట్రలో ఈ పోస్టర్లు చర్చకు దారి తీశాయి.

ఇది కూడా చదవండి: Spain Floods: భారీ వరదలతో స్పెయిన్ అతలాకుతలం.. 100 మంది మృతి!

ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమిలో శివసేన, ఎన్సీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ప్రస్తుతం శివసేనకు సంబంధించిన ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ మూడు పార్టీలు సీట్లు పంచుకుని ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. అయితే తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఇంకా తేల్చలేదు. ఫలితాలు తర్వాత అధిష్టానం డిసైడ్ చేస్తుందని నేతలు చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ముంబై బీజేపీ ఆఫీస్ దగ్గర మాత్రం ఫడ్నవిస్ నవంబర్ 23న ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ బ్యానర్లు వెలిశాయి. తాజాగా ఎన్డీఏ కూటమిలో ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.

ఇది కూడా చదవండి: Vikarabad: దారుణం.. మైనర్ బాలికపై నలుగురు మైనర్లు అత్యాచారం

మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి. అయితే రాష్ట్రంలో ఎన్డీఏ, ఇండియా కూటమిల మధ్య గట్టి పోటీ నెలకొంది. పోటాపోటీగా రెండు కూటమిలు తలపడుతున్నాయి. ప్రస్తుత అధికార పార్టీ మరోసారి అధికారం కోసం ప్రయత్ని్స్తుండగా.. ప్రతిపక్షం అధికారం చేజిక్కించుకోవాలని ఆరాటపడుతోంది. మరి ప్రజలు ఎటు వైపు ఉన్నారన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.

ఇది కూడా చదవండి: Nimmala Rama Naidu: జగన్ కు ఘాటు కౌంటర్ ఇచ్చిన మంత్రి నిమ్మల