Leading News Portal in Telugu

Congress President Mallikarjun Kharge says one nation one election impossible


  • జమిలి ఎన్నికలు ఇండియాలో సాధ్యం కాదు

  • కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్య
Mallikarjun Kharge: జమిలి ఎన్నికలు ఇండియాలో సాధ్యం కాదు

మోడీ ప్రభుత్వం వన్ నేషన్-వన్ ఎలక్షన్‌ అమలు చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే జమిలి ఎన్నికల నివేదికకు మోడీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. నవంబర్‌లో జరిగే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వన్‌ నేషన్‌-వన్ ఎలక్షన్‌ బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధపడుతోంది. అయితే జమిలి ఎన్నికలను దేశంలో కొన్ని పార్టీలు స్వాగతిస్తుండగా.. మరికొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: IND vs SA T20: భారత్‌తో టి20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన

తాజాగా జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్పందించారు. దేశంలో వన్‌ నేషన్‌-వన్ ఎలక్షన్‌ అమలు చేయటం ఎట్టిపరిస్థితుల్లో సాధ్యం కాదని ఖర్గే తేల్చిచెప్పారు. దేశంలో ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ను అతిత్వరలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.

జమిలి ఎన్నికలపై పార్లమెంట్ ఏకాభిప్రాయం అవసరం కాబట్టి వన్‌ నేషన్‌- వన్‌ ఎలక్షన్‌ అమలు చేయటం అసాధ్యం అని ఖర్గే తెలిపారు. ప్రధాని మోడీ ఏమి చెప్పారో.. దానిని ఆయన చేయరన్నారు. ఎందుకంటే వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌ పార్లమెంట్‌ ముందుకు వచ్చినప్పుడు.. అందరి ఆమోదం తీసుకోవాలని.. అప్పుడు మాత్రమే అమలులోకి వస్తుందన్నారు.

ఇది కూడా చదవండి: Game Changer Update: ‘గేమ్ ఛేంజర్’ టీజర్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?

గురువారం సర్దార్ వల్లభాయ్ పటేల్ 149వ జయంతి సందర్భంగా.. గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి మోడీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మోడీ మాట్లాడుతూ.. ‘‘మేం ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా పని చేస్తున్నాం. ఇది భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. అదే విధంగా త్వరలో భారత్‌లో వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌తో పాటు కామన్‌ సివిల్‌ కోడ్‌ అమలు కానుంది.’’ అని మోడీ చెప్పారు.

ఇది కూడా చదవండి: Maharashtra Polls: ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన సీనియర్‌ నేత రవి రాజా