Leading News Portal in Telugu

Rahul gandhi nephew raihan mark diwali with painting and pottery lesson from local artisans


  • సామాన్య ప్రజలతో రాహుల్ దీపావళి వేడుకలు

  • ఆయా వృత్తుల వారితో కలిసి పనులు చేసిన రాహుల్
Rahul Gandhi: సామాన్య ప్రజలతో రాహుల్ దీపావళి వేడుకలు.. మేనల్లుడితో కలిసి ఏం చేశారంటే..!

కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఈ ఏడాది దీపావళి వేడుకలు వైరటీగా చేసుకున్నారు. మేనల్లుడు రేహాన్‌ వాద్రాతో కలిసి సామాన్య ప్రజలతో కలిసి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను రాహుల్‌గాంధీ సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. వైరల్‌గా మారింది.

Rahul

రాహుల్ గాంధీ, రేహాన్ వాద్రా ఆయా కళా వృత్తులు కలిగిన వారితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. పేయింటింగ్ వర్క్ చేసే వారి దగ్గరకు వెళ్లి వారితో కలిసి కొద్దిసేపు పేయింటింగ్ వేసి మెలకువలు తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి ఛాయ్ తాగారు. అనంతరం ప్రమిదలు, కుండలు తయారు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్‌ గాంధీ సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ‘‘భారతదేశాన్ని ప్రకాశవంతం చేసే వారితో దీపావళి’’ అంటూ రాసుకొచ్చారు.

కళాకారులు తయారు చేసే మట్టి ప్రమిదలు ఎప్పటికైనా ప్రపంచంలోని విలువైన సెరామిక్‌తో చేసిన వస్తువులతో పోటీ పడొచ్చు అని రాహుల్‌.. తన మేనల్లుడు రేహాన్‌కు చెప్పారు. ఈ సందర్భంగా కార్మికులు ఎదుర్కొంటున్న సవాళ్లను, సమస్యలను వివరించారు. ఈ కార్మికులు ప్రతి ఒక్కరి దీపావళిని సంతోషకరమైనదిగా చేస్తారని.. ఈ పండగ వీరందరి జీవితాల్లో శ్రేయస్సు, పురోగతి, అభివృద్ధిని తీసుకొస్తుందని ఆశిస్తున్నట్లు రాహుల్ పేర్కొన్నారు.

2024 లోక్‌సభ ఎన్నికల ముందు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర, మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ జోడో న్యాయ్ యాత్రలు చేపట్టారు. ఇలా యాత్ర చేస్తున్నప్పుడు ఆయా వృత్తులకు సంంబంధించిన వారిని కలిసి ముచ్చటించారు. కార్మికులు, బస్ డ్రైవర్లు, విభిన్న వ్యక్తులతో ముచ్చటించారు. వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ.. రాహుల్ వీడియోలు పంచుకున్నారు.