Leading News Portal in Telugu

woman-infant-son-dead-injured-car-plunges-into-gorge-in-jammu-kashmir-reasi – NTV Telugu


  • జమ్మూ కాశ్మీర్‌లో ఘోర ప్రమాదం

  • కారు ప్రమాదంలో 10 నెలల బాలుడితో సహా ముగ్గురు మృతి

  • ప్రమాదవశాత్తు లోతైన లోయలో పడిపోయిన కారు

  • మరో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు.
Jammu Kashmir: లోయలో పడ్డ కారు.. 10 నెలల బాలుడితో సహా ముగ్గురు మృతి

జమ్మూ కాశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రియాసి జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో 10 నెలల బాలుడితో సహా ముగ్గురు మృతి చెందారు. కొండ రహదారిపై నుంచి వెళ్తుండగా కారు ప్రమాదవశాత్తు లోతైన లోయలో పడిపోయింది. దీంతో.. ఒక మహిళ, ఆమె 10 నెలల కొడుకుతో సహా ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి 12.40 గంటల ప్రాంతంలో చామలు మోర్‌లో చోటుచేసుకుంది. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను వెలికి తీసి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత కుటుంబం తమ గ్రామమైన మలికోట్ నుండి చస్సానాకు కారులో వెళుతున్నారు. ఈ సమయంలో డ్రైవర్ కంట్రోల్ తప్పడంతో వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో కుల్చా దేవి (27), కుమారుడు నీరజ్ సింగ్, ఆమె మేనల్లుడు సంధూర్ సింగ్ (19) అక్కడికక్కడే మృతి చెందారు.

గాయపడిన వారిలో చంకర్ సింగ్ (32) దేవి భర్త, అతని సోదరుడు ధుంకర్ (19), మేనల్లుడు అజయ్ సింగ్ (18) ఉన్నారు. వారిని జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాల (జిఎంసి) ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రమాదానికి గురైన వారందరూ రియాసి జిల్లా మలికోటే వాసులేనని అధికారులు నిర్ధారించారు.