Leading News Portal in Telugu

EPFO Recruitment 2024 Notification Out For Young Professionals Post full details are


  • EPFOలో ఉద్యోగం పొందడానికి సువర్ణ అవకాశం.
  • కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెంపరరీ యంగ్ ప్రొఫెషనల్ (YP) పోస్టుల భర్తీ.
  • రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో కేవలం ఇంటర్వ్యూ మాత్రమే.
  • నెలవారీ జీతం రూ. 65000.
EPFO Job Notification: కేవలం ఇంటర్య్వూ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వనున్న ఈపిఎఫ్ఓ

EPFO Job Notification: EPFOలో ఉద్యోగం పొందడానికి సువర్ణ అవకాశం వచ్చింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెంపరరీ యంగ్ ప్రొఫెషనల్ (YP) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఇందులో సెలెక్టయిన అభ్యర్థులను మొదట ఒక సంవత్సరం పాటు నియమించుకుంటారు. అవసరమైతే ఆ కాంట్రాక్టును మూడు సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది. EPFO రిక్రూట్‌మెంట్ 2024 చివరి తేదీఏమిటో తెలుసుకోండి.

ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను EPFO ​​అధికారిక వెబ్‌సైట్. epfindia.gov.inలో సమర్పించవచ్చు. పూర్తి నోటిఫికేషన్ కోసం https://www.epfindia.gov.in/site_docs/PDFs/Recruitments_PDFs/Engagement_of_Young_Professional_29102024.pdf ను చుడండి. దరఖాస్తుదారుల వయస్సు 32 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి. వారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. సంబంధిత ప్రభుత్వ పథకాలలో ముఖ్యంగా సామాజిక భద్రత లేదా కార్మిక రంగంలో పరిశోధన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఒకవేళ ఇందులో ఎంపిక అవుతే.. ఢిల్లీలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగం నెలవారీ జీతం రూ.65,000.

రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో కేవలం ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్‌కు వ్రాత పరీక్ష ఉండదు. ఇంటర్వ్యూ సమయంలో దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఒరిజినల్ డాక్యుమెంట్లు, స్వీయ ధృవీకరించబడిన కాపీలను తీసుకురావాలి. అభ్యర్థులు తప్పనిసరిగా EPFO ​​అధికారిక సైట్ నుండి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆపై అవసరమైన అన్ని పత్రాలతో పాటు గడువులోగా rpfc.exam@epfindia.gov.inకి ఇమెయిల్ చేయాలి.