Leading News Portal in Telugu

A double-decker Bus Fire Accident took place in Hathras of Uttar Pradesh Details are


  • ఢిల్లీ నుంచి బీహార్‌ లోని సుపాల్‌కు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.
  • ఒక్కసారిగా మంటలు
  • ఆహాకారాలు పెట్టిన ప్రయాణికులు.
Bus Fire Accident: బస్సులో ఒక్కసారిగా మంటలు.. ఆహాకారాలు పెట్టిన ప్రయాణికులు

Bus Fire Accident: ఢిల్లీ నుంచి బీహార్‌ లోని సుపాల్‌కు ప్రయాణికులతో వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సులో మంటలు చెలరేగిన ఘటన వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్‌ లోని హత్రాస్‌లో బాద్సా వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదం సమయంలో ప్రయాణికులు, బస్సు డ్రైవర్, కండక్టర్‌, ప్రయాణికులు బస్సులో నుంచి దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారని సమాచారం. హత్రాస్ జిల్లా సదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిధావలి గ్రామ సమీపంలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం జరిగింది.

సమాచారం ప్రకారం.. ఢిల్లీలోని వజీరాబాద్‌ నుంచి డబుల్‌ డెక్కర్‌ బస్సు రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రయాణికులతో బీహార్‌లోని సుపాల్‌కు వెళ్తోంది. ఆయితే ప్రయాణంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇందుకు బస్సు పైకప్పుపై ఉంచిన లగేజీ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. మంటలు ఎగసిపడుతుండడంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇంతలో ప్రయాణికులు వెంటనే బస్సును ఆపి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే సమయానికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదం తర్వాత యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై కాసేపు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. అగ్నిప్రమాదానికి సరైన కారణం ప్రస్తుతం తెలియరాలేదు. కేసు దర్యాప్తులో పోలీసులు నిమగ్నమయ్యారు.

ఈ ఘటన సుదూర ప్రయాణాల్లో భద్రతపై మరోసారి అనేక ప్రశ్నలను లేవనెత్తింది. అదృష్టవశాత్తూ, ప్రమాదంలో ఏ ప్రయాణీకుడు ప్రాణాలు కోల్పోలేదు. కానీ సకాలంలో సహాయక చర్యలు చేపట్టకపోతే, ఫలితం భిన్నంగా ఉండేది. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.