- జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో తొలిరోజే రగడ..
-
ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా పీడీసీ పార్టీ తీర్మానం.. -
తీర్మానాన్ని అనుమతించకూడదని బీజేపీ డిమాండ్.. -
పబ్లిసిటీ కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు: సీఎం ఒమర్ అబ్దుల్లా

J&K Assembly session: జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో తొలిరోజే రగడ కొనసాగుతుంది. ఆర్టికల్ 370పై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) ఎమ్మెల్యే వహీద్ పారా తీర్మానం ప్రవేశ పెట్టింది. జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక హోదా కొనసాగించాలని డిమాండ్ చేసింది. అయితే, ఈ తీర్మానాన్ని అనుమతించకూడదని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది.
ఈ సందర్భంగా బీజేపీపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. పబ్లిసిటీ కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నట్లు 2019 ఆగస్టు 5న తీసుకున్న నిర్ణయాన్ని జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఆమోదించడం లేదని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. దీంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధంతో సభలో గందరగోళం ఏర్పడింది. అయితే, ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి ప్రత్యేక స్వయంప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఒక నిబంధన. రక్షణ, కమ్యూనికేషన్లతో పాటు విదేశీ వ్యవహారాలు మినహా అంతర్గత విషయాలపై రాష్ట్రం దాని స్వంత రాజ్యాంగాన్ని కలిగి ఉంటుంది.