Leading News Portal in Telugu

Father and daughter killed a woman for trying to force her daughter into prostitution


  • కూతురిని వ్యభిచారంలోకి దించాలని ప్రయత్నించడంతో.
  • మహిళని హత్య చేసిన తండ్రికూతురు.
  • మంజూర్ స్టేషన్ ప్లాట్‌ఫాంపై శవం ఉంచిన సూట్ కేసును పడేసిన ఘటన.
Murder Case: కూతురిని వ్యభిచారంలోకి దించాలని ప్రయత్నించడంతో మహిళని హత్య చేసిన తండ్రికూతురు

Murder Case: నెల్లూరు నగరానికి చెందిన సుబ్రహ్మణ్యం అతని కూతురు దివ్యశ్రీ నెల్లూరులో ఓ మహిళను హత్య చేసి ఆపై చెన్నై వైపు వెళ్లే సబర్బన్ ఎలక్ట్రికల్ రైలులో ప్రయాణం చేసి.. మంజూర్ స్టేషన్ కు రాగానే స్టేషన్ ప్లాట్‌ఫాంపై తండ్రికూతురు శవం ఉంచిన సూట్ కేసును పడేసిన ఘటనలో పోలీసులు పూర్తి వివరాలను వెల్లడించారు. ఈ ఘటనలో నెల్లూరు సంతపేటకు చెందిన మన్నెం రమణమ్మ (65) మరణించినట్లు గుర్తించారు పోలీసులు.

సోమవారం ఉదయం కూరగాయల కోసం మార్కెట్ కి వెళ్ళిన రమణమ్మను, ఆమె వేసుకున్న నగల కోసం రమణమ్మను తీసుకెళ్లి హత మార్చారు. ఆ తర్వాత శవాన్ని సూట్ కేసులో పెట్టి చెన్నైలోని మీంజూరు స్టేషన్లో తండ్రి కూతురు. ఈ విషయాన్నీ నెల్లూరు పోలీసులకు సమాచారం ఇచ్చిన చెన్నై పోలీసులు హత్యకు గురైంది 65 ఎళ్ళు వృద్దురాలు మ‌ణ్యం రమణిగా గుర్తించారు. ఈ హత్యకు కారణం సుబ్రహ్మణ్యం కూతురిని వ్యభిచారంలోకి దించాలని రమణి పలుమార్లు ప్రయత్నించడంతో చంపామని పోలీసుల విచారణలో తెలిపారు తండ్రి సుబ్రహ్మణ్యం, కూతురు దివ్యశ్రీ.

ఈ విచారణలో సోమవారం ఉదయం ఇంటికి వచ్చి దివ్యశ్రీ ను తనతో పంపిస్తే పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని రమణి చెప్పిందని‌, అ సమయంలో జరిగినా గోడవతోనే అమె హత్య చేసినట్లు తండ్రి సుబ్రమణ్యం తెలిపాడు. సుబ్రహ్మణ్యంది నెల్లూరు జిలా కుక్కల గుంట. ఈ ఘటనలో రమణి మెడలోని 50 గ్రాముల బంగారాన్ని తీసుకుని బాడి సూట్ కేసులో పెట్టారు తండ్రికూతురు.