Leading News Portal in Telugu

Salman Khan’s Ex-Girlfriend Somy Ali Says Sushant Singh Rajput Was Killed, Autopsy Altered: ‘Ask AIIMS Doctor…’


  • సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్య కాదు..హత్య..

  • సల్మాన్ ఖాన్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ సోమీ అలీ సంచలనం..
Somy Ali: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్య కాదు, హత్య.. సల్మాన్ ఖాన్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ సంచలనం..

Somy Ali: సల్మాన్ ఖాన్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల కాలంలో సల్మాన్ ఖాన్ తనను ఏ విధంగా వేధించాడనే విషయాలను బయటపెట్టిన సోమీ అలీ, ఈ సారి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై స్పందించారు. ఆయనది ఆత్మహత్య కాదని, హత్య అని పేర్కొన్నారు. పోస్టుమార్టం రిపోర్టులో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారని, అతని పోస్టుమార్టం నివేదికను ఎయిమ్స్ డాక్టర్ సుధీర్ గుప్తా ఎందుకు మార్చారు.? అడగండి అంటూ ఆమె రెడ్డిట్‌లో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు గురించి అడిగిన సందర్భంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, జియా ఖాన్‌లకు న్యాయం కావాలి, రవీంద్ర పాటిల్‌ ఎలా ఉన్నారు..? అతడికి ఏం జరిగింది గూగుల్ చేయండి అని సోమీ కోరారుు. 2020 అక్టోబర్ ‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన నివాసంలో శవంగా కనిపించాడు. ఏయిమ్స్ డాక్టర్ బోర్డు దీనిని ఆత్మహత్యగా చెప్పింది. హత్య ఆరోపణల్ని తోసిపుచ్చింది. ఆరుగురు ఫోరెన్సిక్ వైద్యుల బృందం విషం, గొంతు నులిమి చంపడం వంటి ఆరోపణల్ని తోసిపుచ్చింది. ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడికల్ బోర్డ్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్ గుప్తా.. సుశాంత్ సింగ్ మరణానికి ఉరి వేసుకోవడమే కారణమని, అతడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని నివేదించాడు.

బాలీవుడ్ నటి జియా ఖాన్ గర్భవతిగా ఉన్న సమయంలో ఉరేసుకుని కనిపించిందని, ఆమె మరణం తర్వాత సల్మాన్‌ ఖాన్‌ని సూరజ్ పంచోలి సలహాలు కోరాడని సోమీ అలీ ఆరోపించారు. సల్మాన్ ఖాన్ కన్నా సీరియల్ కిల్లర్ టెడ్ బండీ నయమని ఆమె వ్యాఖ్యానించారు. తాను సల్మాన్ ఖాన్‌ని విడిచిపెట్టడానికి అతడి వేధింపులే కారణమని, రోజూ శారీరకంగా, మానసికంగా వేధించేవాడని చెప్పింది. తాను అతడిని విడిచి పెట్టే సమయంలో ఆష్ అనే కొత్త అమ్మాయితో బాయ్‌ఫ్రెండ్‌గా ఉన్నాడని ఆమె పేర్కొన్నారు. తాను బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నం చేసినప్పటికీ, చాలా మంది నిరోధించారని చెప్పింది.