Leading News Portal in Telugu

Bullet Train Bridge Collapse in Gujarat


  • బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో ప్రమాదం

  • పిల్లర్లు కూలి ఒకరు మృతి

  • గుజరాత్‌లోని ఆనంద్‌ జిల్లాలో ఘటన
Gujarat: బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో ప్రమాదం.. పిల్లర్లు కూలి ఒకరు మృతి

గుజరాత్‌లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. ఆనంద్‌ జిల్లాలో నిర్మాణంలో ఉన్న తాత్కాలిక కట్టడం ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరిని సురక్షితంగా రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఒకరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలికి చేరుకున్న రెస్క్యూ బృందాలు.. శిథిలాల్లో చిక్కుకున్న కార్మికులను వెలికితీసే ప్రయత్నాలు చేపట్టారు. ఘటనాస్థలి దగ్గర పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు.

ఇది కూడా చదవండి: Off The Record : రసవత్తరంగా మారిన హిందూపురం రాజకీయాలు.. వైసీపీ పీఠాన్ని కదిలించే దిశగా టీడీపీ అడుగులు

ఆనంద్‌ జిల్లాలోని వల్సాద్‌ గ్రామంలో బుల్లెట్ ట్రైన్ పనులు జరుగుతున్నాయి. కాంక్రీట్‌ దిమ్మెల ఒక్కసారిగా కిందపడ్డాయి. వాటిపై కూర్చున్న నలుగురు వాటిల్లో చిక్కుకున్నారు. శిథిలాల కింద నుంచి వెలికితీసిన ఇద్దర్ని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఒకరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని జిల్లా ఎస్పీ గౌరవ్‌ జాసాని వెల్లడించారు. స్టీల్‌, కాంక్రీటుతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నిర్మాణం కూలిపోయిందని నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. వడోదరా సమీపంలో ఉన్న మహీ నదికి దగ్గరలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని, సహాయక కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు.