Leading News Portal in Telugu

UP: To Buy Expensive Gifts For Canadian GF & 2 Others, Barabanki Youth Tries To Rob Bank But Fails; Arrested Later


  • గర్ల్‌ఫ్రెండ్స్‌కి ఖరీదైన గిఫ్ట్‌లు ఇచ్చేందుకు బ్యాంకే కన్నం..

  • ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్‌ని ఇంప్రెస్ చేసే ప్రయత్నం..

  • చివరకు ప్లాన్ విఫలమై పోలీసులకు చిక్కిన నిందితుడు..
UP: ఎవడ్రా నువ్వు.. ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్.. గిఫ్ట్‌ల కోసం బ్యాంకుకే కన్నం…

UP: ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్‌కి ఖరీదైన గిఫ్ట్స్ కొనివ్వడానికి ఓ యువకుడు బ్యాంక్‌కే కన్నం వేశాడు. ప్లాన్ విఫలమవ్వడంతో పోలీసులకు చిక్కాడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని బరాబంకిలో ఈ ఘటన జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన కెనడాలోని ఓ గర్ల్‌ఫ్రెండ్‌ కోసం ఖరీదైన బహుమతులు ఇచ్చేందుకు బ్యాంకును దోచుకోవడానికి ప్రయత్నించిన అబ్దుల్ సమద్ ఖాన్ అలియాస్ షాహిద్ ఖాన్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌‌లో ముగ్గురు యువతులతో స్నేహం చేస్తూ, వారికి ఆకర్షణీయమైన గిఫ్ట్స్ ఇస్తూ ఆకట్టుకోవాలని అనుకున్నాడు.

అక్టోబర్ 30న బ్యాంక్ దగ్గర సమద్ టీ తాగుతుండగా, ఛాయా చౌరాహాలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్‌లోకి చాలా మంది వ్యక్తులు రావడం గమనించాడు. జనాలను చూసి బ్యాంకులో కోటి రూపాయలు ఉండొచ్చని భావించాడు. 3-4 రోజుల పాటు బ్యాంక్ హాలిడేస్ ఉండటంతో బ్యాంక్ దోపిడికి ప్లాన్ చేశాడు. అక్టోబర్ 31న రాత్రి వేళ బ్యాంక్ ఆవరణలోకి ప్రవేశించాడు. తాళాలు పగలగొట్టేందుకు ఇనుప రాడ్లు, ఇనుమను కత్తిరించడానికి గ్రైండర్ మిషన్ తన వెంట తీసుకెళ్లాడు. అయితే, మెయిన్ డోర్ మాత్రం తెరవలేకపోయాడు.

నవంబర్ 4న బ్యాంక్ సిబ్బంది తిరిగి తెరిచిన సమయంలో, బ్యాంక్‌లో దోపిడీకి యత్నించినట్లు కనిపించడంతో మేనేజర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించి నిందితుడు అబ్దుల్ సమద్ ఖాన్‌ని గుర్తించారు. ఇతడి ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్‌లో ఒకరు కెనడాలో ఉండగా మరొకరు యూపీ, ఇంకొకరు కేరళకు చెందిన అమ్మాయిగా తేలింది.