Leading News Portal in Telugu

No Matter Who Wins Donald Trump Or Kamala Harris The Interests Of The Country Are Important: Jaishankar


  • ట్రంప్‌.. హారిస్‌లలో ఎవరు గెలిచినా తమ దేశ సొంత ప్రయోజనాలకే పని చేస్తారు..

  • అమెరికా పరిపాలన భావజాలాన్ని జాతీయంగా చూడటమే చాలా ముఖ్యం..

  • యూఎస్ నుంచి అందుతున్న దాతృత్వం కొనసాగే అవకాశాలు తగ్గుతాయి: కేంద్రమంత్రి జైశంకర్
S Jaishankar: డొనాల్డ్ ట్రంప్‌, కమలా హారిస్‌లలో ఎవరు గెలిచినా ఆ దేశ ప్రయోజనాలకే పని చేస్తారు..

S Jaishankar: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్‌ విజయం దాదాపు ఫిక్స్ అయింది. ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తదుపరి అధ్యక్షులుగా ఎవరు ఎన్నికైనా వారి సొంత ప్రయోజనాల కోసమే పని చేస్తారని చెప్పుకొచ్చారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ విదేశాంగ మంత్రులతో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన ఈ మేరకు కామెంట్స్ చేశారు.

ఇక, అభ్యర్థుల అభిప్రాయాలు ప్రజల ప్రాధాన్యతలకు విరుద్ధంగా ఉంటాయని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. ఇది ఒబామా నుంచి ప్రారంభమైంది.. అమెరికా అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి ఉంది.. ట్రంప్‌ ఆ విషయంలో మరింత స్పష్టంగా, భావవ్యక్తీకరణతో ఉండొచ్చని చెప్పుకొచ్చారు. కానీ, వాస్తవమేమిటంటే యూఎస్ పరిపాలన భావజాలాన్ని జాతీయంగా చూడటమే చాలా ముఖ్యం అని వెల్లడించారు. అలాగే, ప్రస్తుతం అమెరికా నుంచి అందుతున్న దాతృత్వం కొనసాగే అవకాశాలు తగ్గుతాయని చెప్పుకొచ్చారు. అందుకు ప్రపంచ దేశాలు రెడీగా ఉండాలని జైశంకర్ వెల్లడించారు. ఇదిలా ఉండగా.. తమ దేశాలు కోరుకున్న విధంగా ప్రపంచ వాతావరణంలో మార్పులు తీసుకొచ్చేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, భారత్ దేశాలకు చెందిన ముగ్గురు విదేశాంగ మంత్రులు పిలుపునిచ్చారు.