Leading News Portal in Telugu

GST Notices for Padmanabha Swamy Temple


  • కేరళలో ప్రసిద్ధ పద్మనాభ స్వామి ఆలయం
  • ఆలయానికి తాజాగా జీఎస్టీ నోటీసులు
  • 7 ఏళ్లుగా బాకాయి చెల్లించలేదన్న జీఎస్టీ శాఖ
  • రూ.1.57 కోట్ల బకాయి చెల్లించాలని నోటీసుల జారీ
  • స్పందించిన ఆలయ నిర్వహకులు
  • ఆలయానికి జీఎస్టీలో మినహాయింపు ఉందని వెల్లడి
GST Dept: పద్మనాభ స్వామి ఆలయానికి రూ.1.57 కోట్ల జీఎస్టీ నోటీసులు..

కేరళలోని తిరువనంతపురంలో పద్మనాభ స్వామి ఆలయం ఉంది. చాలా సంవత్సరాలుగా భక్తులు స్వామివారిని విశ్వసిస్తూ.. దర్శించుకుంటున్నారు. తాజాగా ఈ టెంపుల్‌కి సంబంధించిన ఓ వార్తపై భక్తులు ఆగ్రహం వ్యక్తి చేస్తున్నారు. అయితే.. రూ.1.57 కోట్ల జీఎస్టీని చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆలయ నిర్వాహకులకు జీఎస్టీ విభాగం నోటీసు పంపింది. ఏడేళ్లుగా ఆలయంపై జీఎస్టీ బకాయి ఉందని నోటీసులో పేర్కొంది.

READ MORE: Prashanth Varma: ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా ప్రశాంత్ వర్మా.. బాక్స్ ఆఫీస్ తట్టుకోగలదా?

ఆలయానికి పెరుగుతున్న ఆదాయం..
శాఖ పంపిన నోటీసు ప్రకారం.. ఆలయానికి అనేక విధాలుగా ఆదాయం సమకూరుతోంది. వీటిలో భక్తులు సమర్పించే వస్త్రాలు కూడా ఉన్నాయి. వాటి ద్వారా ఆలయ నిర్వహణకు చాలా ఆదాయం వస్తుంది. అంతే కాకుండా విగ్రహాల విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా చేర్చారు. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులు ఏనుగులను అద్దెకు తీసుకోవడం వల్ల ఆలయానికి ఆదాయం సమకూరుతుంది.

READ MORE:Amaran: శివకార్తికేయన్‌ని బాక్సాఫీస్ బాహుబలిగా మార్చిన అమరన్!

ఏడేళ్లుగా జీఎస్టీ చెల్లించలేదు..
ఏడేళ్లుగా ఆలయ నిర్వాహకులు జీఎస్టీ చెల్లించడం లేదని అధికారులు చెబుతున్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులకు నోటీసులు పంపారు. అదే సమయంలో ఈ విషయంపై ఆలయ అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఆలయానికి అనేక రకాల పన్ను మినహాయింపులు ఉన్నాయని చెప్పారు. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.16 లక్షలు మాత్రమేనని.. అందులో రూ.3 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. అయితే.. 2017 నుంచి బకాయి పన్నును ఆలయ నిర్వాహకులు జమ చేయలేదని ఆ శాఖ పేర్కొంది. మొత్తం చెల్లించనందుకు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. 18 శాతం వడ్డీ కూడా వసూలు చేస్తారు.