congress announces five guarantees ahead of maharashtra election including rs 25 lakh health insurance
- మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు గ్యారంటీల ప్రకటన
-
నెలకు 3 వేలు.. ఫ్రీ బస్ సహా 5 గ్యారంటీలు ప్రకటించిన రాహుల్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఐదు గ్యారంటీలను ప్రకటించింది. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌గాంధీచే ఈ వాగ్దానాలను ప్రకటింపజేశారు. భాగ్యలక్ష్మీ పేరుతో మహిళలకు నెలకు రూ.3 వేలు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. వీటితో పాటు రూ. 3 లక్షల వరకు వ్యవసాయ రుణమాఫీ, రూ. 15 లక్షల వరకు కుటుంబ ఆరోగ్య బీమా, కుల గణన, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఐదు హామీల పథకాన్ని ప్రకటించారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ. 4,000 వరకు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Donald Trump: చిరుధాన్యాలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చిత్రపటం.. విశాఖ చిత్రకారుడి ప్రతిభ
ముంబైలో ప్రజలనుద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ… ‘‘ఇది భావజాల యుద్ధం, ఒక వైపు బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ ఉన్నాయి. మరోవైపు భారతదేశ కూటమి ఉంది. ఇంకో వైపు అంబేద్కర్ రాజ్యాంగం, సమానత్వం ఉంది. మరియు మొహబ్బత్ (ప్రేమ) మరియు గౌరవం, మరోవైపు బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Maharashtra Polls: నెలకు 3వేలు.. ఫ్రీ బస్ సహా 5 గ్యారంటీలు ప్రకటించిన రాహుల్
కాంగ్రెస్ మిత్రపక్షమైన శివసేన (యూబీటీ) మంగళవారం సొంతంగా ఐదు హామీలను ప్రకటించింది. ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో ఆడపిల్లలకు ఉచిత విద్య, మగపిల్లలకు కూడా ఉచిత విద్య అందిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం బాలికలకు ఉన్నత విద్యను ఉచితంగా అందజేస్తోంది. అబ్బాయిలు చేసిన నేరమేంటి?.. వారికి కూడా అదే విధంగా అందజేస్తాం.’’ అని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.
బుధవారం అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ కూడా మ్యానిఫెస్టో విడుదల చేసింది. అనేక హామీలను ప్రకటించింది. 288 మంది శాసనసభ స్థానాలు కలిగిన మహారాష్ట్రలో నవంబరు 20న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. నవంబరు 23న ఫలితాలను ప్రకటించనున్నారు.
#MaharashtraAssemblyElection | Congress announces 5 guarantees for Maharashtra- Rs 3000 per month to women and free bus travel for women and girls under Mahalakshmi Yojana. Loan waiver of up to Rs 3 lakh to farmers and incentive of Rs 50,000 for regular loan repayment. Will… pic.twitter.com/YmOTj2uGOr
— ANI (@ANI) November 6, 2024