Leading News Portal in Telugu

ఇండియాలో కరోనా ముగింపుపై గుడ్ న్యూస్ చెప్పిన సింగపూర్ పరిశోధకులు

దేశంలో ఉన్న కరోనా కేసులు, వ్యాప్తి, నమోదవుతున్న కేసులు, లాక్‌డౌన్, ఇండియాలో పరిస్థితులు, మెడికల్ సౌకర్యాలు ఇవన్నీ లెక్కలోకి తీసుకున్న సింగపూర్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ (SUTD) పరిశోధకులు… ఇండియాలో కరోనా వైరస్… మే 21 నాటికి పూర్తిగా తొలగిపోతుందని అంచనా వేశారు. ఇదే సమయానికి చాలా దేశాల్లో కరోనా వైరస్ వెళ్లిపోతుందని కూడా అన్నారు. ఇందుకోసం ఈ పరిశోధకులు SIR (సస్సెప్టిబుల్ ఇన్ఫెక్టెడ్ రికవర్డ్ – అనుమానం – వ్యాప్తి – రికవరీ) మోడల్‌ను లెక్కలోకి తీసుకున్నారు. ఇండియాతోపాటూ… చాలా దేశాల డేటాను ఇలాగే పరిశీలించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎలా వ్యాపిస్తోందో లెక్కలేశారు.

గణాంకాల లెక్కల ఆధారంగా వచ్చిన ఈ అంచనా ద్వారా… మే 21 నాటికి ఇండియాలో కరోనా వైరస్ 97 శాతం వదిలిపోతుంది. ఇండియాలో కరోనా వైరస్ ఏ విధంగా ప్రబలుతోందో SUTD ఎక్కువగా దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రోజువారీ డేటాను పరిశీలించింది. ఐతే… ఈ పరిశోధనా సారాంశాన్ని అధ్యయనం కోసమే ఉపయోగిస్తున్నారు తప్ప… ఇతర అంశాల కోసం ఇవ్వట్లేదు.

లాక్‌డౌన్‌ను మే 16 వరకూ కొనసాగిస్తే… కొత్త కేసుల నమోదు ఉండకపోవచ్చనే అభిప్రాయం ఇండియాలో వ్యక్తమవుతోంది. ఐతే… ప్రస్తుతం ఇండియాలో మొత్తం యాక్టివ్ కేసులు 20 వేల దాకా ఉన్నాయి. వీళ్లందరికీ… వచ్చే రెండు మూడు వారాల్లో కరోనా నయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే… దేశంలో కొత్త కేసుల నమోదు ప్రస్తుతం ఎక్కువగానే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 1990 కేసులు నమోదవ్వగా… 49 మంది చనిపోయారు. ఇప్పటివరకూ ఇండియాలో ఇదే అతి ఎక్కువ నమోదు. కొత్త కేసుల్ని తగ్గిస్తూ… ఉన్న కేసుల్ని రికవరీ చేస్తూ పోవాల్సిన సవాల్ ముందుంది.