Leading News Portal in Telugu

కరోనా వైరస్ బారినపడి ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ మృతి

మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. ముంబైలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు సైతం.. కరోనా బారినపడుతున్నారు. ఈ క్రమంలో ముంబైలో ఓ ట్రాఫిక్ పోలిస్ మరణించారు. కుర్లా ట్రాఫిక్ డివిజన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించే శివాజీ నారాయణ (56) కరోనాతో మరణించినట్లు ముంబైలో పోలీస్ విభాగం తెలిపింది. ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. శివాజీ నారాయణ్ మృతి దురదృష్టకరమని.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. శివాజీ కుటుంబ సభ్యులు ముంబై పోలీస్ విభాగం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు.