CM Jagan: వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ, రేపు జగన్ పర్యటన.. కాలినడకన గ్రామంలో వరద పరిస్థితిపై.. – Telugu News | CM Jagan to stay in flood affected areas for two days, to interact with victims
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం ఏలూరులో పర్యటించనున్న నేపథ్యంలో గోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆగస్ట్ 7, 8 తేదీల్లో వరద బాధిత అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. సోమవారం అల్లూరి జిల్లా కూనవరం, వీఆర్ పురం, వదర బాధితులతో సీఎం భేటీ కానున్నారు. అనంతరం కుక్కునూరు మండలం గొమ్ముగూడెంలో పర్యటించనున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ, రేపు పర్యటించనున్నారు. వరద బాధిత గోదావరి జిల్లాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నుంచి రెండు రోజులపాటు పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో వరద బాధితులతో ఆయన సంభాషించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం ఏలూరులో పర్యటించనున్న నేపథ్యంలో గోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పట్టిసం గ్రామంలో టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి నాయుడు ప్రసంగిస్తారు. ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించే అవకాశం ఉంది.
ఏఎస్‌ఆర్‌లో దాదాపు 250 గ్రామాలు అతలాకుతలమై రోడ్డు కనెక్టివిటీకి అంతరాయం ఏర్పడింది. ఏలూరులోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు, పశ్చిమగోదావరిలోని 10 లంక గ్రామాలు, కోనసీమలోని పలు మండలాలు ముంపునకు గురయ్యాయి. గోదావరి వరదల్లో ఆయా జిల్లాల అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వరద ప్రభావితంగా మారిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మంగళవారం సీఎం పర్యటన ఉండనుంది. వరద ప్రభావిత గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా సీఎం జగన్ తెలుసుకోనున్నారు.
సోమవారం ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట చేరుకుంటారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై అధికారులతో మాట్లాడి.. కూనవరం బస్టాండ్ సెంటర్‌లో కూనవరం, వీఆర్ పురం మండలాల వరద బాధితులతో మాట్లాడుతారు. వారు ఎదుర్కొన్న సమస్యలు, పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్ల తీరుపై అడిగి తెలుసుకుంటారు.
కార్యక్రమ వివరాలు ఇలా..
సోమవారం ఉదయం 9.30 గంటలకు కూనవరం మండలం కోతులగుట్టకు జగన్ బయలుదేరి వెళతారు. ఉదయం 10.25 గంటలకు ఆయన చేరుకుని వరద ప్రభావం, సహాయక చర్యలపై అధికారులతో సమీక్షిస్తారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై అధికారులతో మాట్లాడతారు. అక్కడ వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలిస్తారు. ఆ తర్వాత వరద బాధిత కుటుంబాలతో సమావేశమవుతారు. అనంతరం కూనవరం, వీఆర్ పురం మండలాల వరద బాధితులతో మమేకమవుతారు.
అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 1.40 గంటలకు కుక్కునూరు మండలం గొమ్ముకుడెంకు చేరుకుంటారు. గొమ్ముగూడెంలో జరిగే ఫొటో ఎగ్జిబిషన్‌కు వెళ్లనున్నారు. అనంతరం సాయంత్రం 4.10 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బస చేస్తారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా అధికారులను ఉద్దేశించి ఆయన వరద సహాయక చర్యలను సమీక్షించనున్నారు.
మంగళవారం ఉదయం..
సాయంత్రానికి రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని అధికారులతో సమావేశం కానున్నారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. మంగళవారం ఉదయం అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గురజాపులంక చేరుకుంటారు.. అక్కడ వరద బాధితులతో మాట్లాడిన అనంతరం తానేలంక రామాలయంపేట గ్రామం వెళతారు. అక్కడ వరద బాధితులతో సమావేశమవుతారు. ఆ తర్వాత అయినవిల్లి మండలం తోటరాముడివారిపేట, కొండుకుదురు చేరుకుంటారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం