Leading News Portal in Telugu

CM Jagan: ముంపు బాధితుల పునరావాస ప్యాకేజీ పారదర్శకంగా అమలు..కూనవరంలో సీఎం జగన్‌ ప్రకటన – Telugu News | CM YS Jagan visits Godavari districts, assures Compensation for flood victims


పోలవరం నిర్మాణంలో చంద్రబాబు చేసింది పెద్ద తప్పు అంటూ విమర్శించారు. పోలవరం ముంపు బాధితుల పునరావాస ప్యాకేజీ పారదర్శకంగా అమలు చేస్తున్నట్లుగా తెలిపారు. పునరావాస ప్యాకేజీకి త్వరలోనే కేంద్రం ఆమోదం లభిస్తుందన్నారు. పోలవరం పరిహారం కేంద్రం స్వయంగా చెల్లించినా పర్వాలేదు.. బాధితులకు రావాల్సిన ప్యాకేజ్‌పై మంచి జరుగుతుందన్నారు. లి దశలో 41.15 మీటర్ల ఎత్తుకు నీళ్లు నింపినప్పుడు ముంపునకు గురయ్యే గ్రామాలు, కుటుంబాలకు ప్యాకేజీ అందిస్తామని తెలిపారు. ముంపునకు గురయ్యే గ్రామాలకు సంబంధించి ఇప్పటికే లిడార్‌ సర్వే చేయించామని సీఎం వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లోపే ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆగస్టు, 07:  పోలవరం నిర్మాణంలో తమ ప్రభుత్వం క్రెడిట్‌ కోసం ఆలోచించదన్నారు ముఖ్యమత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు న్యాయం చేయడమే మా సంకల్పం అని అన్నారు. ఆర్‌&ఆర్‌ విషయంలో కేంద్రం నిధులకు తోడు రాష్ట్రం నిధులు ఉన్నాయని అన్నారు. పోలవరం నిర్మాణంలో చంద్రబాబు చేసింది పెద్ద తప్పు అంటూ విమర్శించారు. పోలవరం ముంపు బాధితులకు పారదర్శకంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పునరావాస ప్యాకేజీకి త్వరలోనే కేంద్రం ఆమోదం లభిస్తుందన్నారు. కేంద్రం స్వయంగా అందించినా మంచిదే.. వారికి రావాల్సిన ప్యాకేజీ పై మంచి జరుగుతుందన్నారు సీఎం జగన్. ప్రతి నిర్వాసిత కుటుంబానికి న్యాయపరమైన ప్యాకేజీ అందుతుందన్నారు.  ముంపు ప్రాంతాల్లో లీడార్‌ సర్వే ద్వారా అందరికీ న్యాయం జరుగుతుందని.. థర్డ్ ఫేస్‌లో పోలవరం డ్యాంలో నీళ్లు నింపుతామని అన్నారు. పోలవరంలో ఒక్కసారిగా నీటిని నింపకుండా విడతలవారిగా నింపుతామని హామీ ఇచ్చారు. ఒక్కసారి నింపితే పోలవరం డ్యాం కూలిపోయే అవకాశం ఉందన్నారు. సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ ఆదేశాల ప్రకారమే ముందుకెళ్తున్నారు సీఎం జగన్.

అల్లూరి జిల్లా కూనవరం, వరరామచంద్రాపురం మండలాల్లో మొన్నటి వరదల్లో చిక్కుకుపోయిన గ్రామాలను జగన్‌ సందర్శించారు. బాధితులను పరామర్శించారు. అందరికీ సాయం అందించాలని కలెక్టర్లు, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందించానని తెలిపారు. మరో వారం తర్వాత మళ్లీ ఈ గ్రామాలను సందర్శిస్తానని, అప్పటికీ ఏమైనా ఫిర్యాదులు ఉంటే అధికారులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్‌ సమక్షంలో సీఎం ప్రకటించారు. సాయం అందుతున్న తీరును బాధిత ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలకు సంబంధించి తొలిదశ పునరావాస ప్యాకేజీకి ఈ నెలాఖరులోపు కేంద్రం నుంచి ఆమోదం లభించవచ్చని ముఖ్యమంత్రి జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తుకు నీళ్లు నింపినప్పుడు ముంపునకు గురయ్యే గ్రామాలు, కుటుంబాలకు ప్యాకేజీ అందిస్తామని తెలిపారు. ముంపునకు గురయ్యే గ్రామాలకు సంబంధించి ఇప్పటికే లిడార్‌ సర్వే చేయించామని సీఎం వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లోపే ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం