Leading News Portal in Telugu

Andhra Pradesh: వైసీపీ వర్సెస్ టీడీపీ.. పోలవరంపై కొనసాగుతున్న రగడ.. చంద్రబాబు ఏమన్నారంటే..? – Telugu News | TDP chief Chandrababu Naidu gave a power point presentation on irrigation projects at in Rajahmundry


Chandrababu Naidu: ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ చుట్టూ రాష్ట్ర రాజకీయాలు ఊపందుకున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ సందర్శించి ప్రభుత్వంపై విమర్శలు చేయగా.. సీఎం జగన్‌తో పాటు వైసీపీ నేతలు కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. తాజాగా గోదావరి జిల్లాల్లో ఉన్న ప్రాజెక్టుల స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి.. వైసీపీని టార్గెట్ చేశారు టీడీపీ అధినేత.

Chandrababu Naidu: ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ చుట్టూ రాష్ట్ర రాజకీయాలు ఊపందుకున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ సందర్శించి ప్రభుత్వంపై విమర్శలు చేయగా.. సీఎం జగన్‌తో పాటు వైసీపీ నేతలు కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. తాజాగా గోదావరి జిల్లాల్లో ఉన్న ప్రాజెక్టుల స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి.. వైసీపీని టార్గెట్ చేశారు టీడీపీ అధినేత.

సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై రాజమండ్రిలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. పోలవరం నిర్మాణంపై జగన్ చేతులెత్తేశారని, ఒక మూర్ఖుడు అధికారంలో ఉంటే ఎంత నష్టం జరుగుతుందో చెప్పడానికి పోలవరమే పెద్ద కేస్ స్టడీ అని విరుచుకుపడ్డారు. నాలుగేళ్లలో ఏ ఒక్కరికీ పరిహారం అందకపోగా.. లబ్ధిదారుల జాబితాను మార్చి, అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పట్టిసీమతో సమానంగా ఎకరానికి రూ.19 లక్షల పరిహారం ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పరిధిలో కొత్తగా ఒక్క కట్టడమూ కూడా కట్టలేకపోయారని విమర్శించారు.

ఇక, ఈ పర్యటనలో భాగంగా ఉదయం BVR కన్వెన్షన్ హాల్‌లో సాగునీటిరంగానికి సంంబధించి మేధావులతో సమావేశమయ్యారు చంద్రబాబు. గోదావరి నదిపై ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. పోలవరం లాంటి కీలక ప్రాజెక్టుపై జగన్ ప్రభుత్వపు చిత్తశుద్దిని ప్రశ్నించారు చంద్రబాబు. తర్వాత సీతానగరం లిఫ్ట్ ఇరిగేషన్‌ పనులను పరిశీలించారు చంద్రబాబు. అనంతరం కోరుకొండ బహిరంగసభలో పాల్గొన్న చంద్రబాబు మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ఇవి కూడా చదవండి

అంబటి రాంబాబు ఫైర్..

మరోవైపు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి అంబటి రాంబాబు.. పోలవరంలో నాడు-నేడు పేరుతో ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేశారు. పోలవరం ప్రాజక్టు 2019 నాటి పరిస్థితి, ప్రస్తుత పరిస్థితిని ఫొటోల ద్వారా వివరించారు. పోలవరం స్పిల్‌వే, కాంక్రీట్‌ డ్యామ్‌, అప్రోచ్‌ ఛానల్‌ పురోగతిపై మంత్రి వివరణ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకే ప్రాజెక్టు వద్దకు వచ్చానన్నారు. వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసిన స్పిల్‌వేపై నుంచే చంద్రబాబు వెళ్లారని తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..