Leading News Portal in Telugu

Big News Big Debate: కిస్సు-బుస్సులు.. మహిళలంటే రాహుల్‌కు రెస్పెక్ట్‌ లేదా..? – Telugu News | Big News Big Debate Live 09 08 2023 on Rahul Gandhi Flying Kiss In Parliament

Big News Big Debate: అనర్హత వేటు నుంచి తప్పించుకుని కోర్టు ఆదేశాలతో లోక్‌సభలో అడుగుపెట్టిన రాహుల్‌గాంధీని అనూహ్యంగా ఓ వివాదం చుట్టుముట్టింది. సీరియస్‌ చర్చ మధ్యలో నాన్‌ సీరియస్‌ అన్నట్టుగా రాహుల్‌ గాల్లోకి వదిలిన ఓ ఫ్లైయింగ్ కిస్ దేశవ్యాప్తంగా అలజడి రేపింది. అసభ్య ప్రవర్తనకు పాల్పడిన రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీకి చెందిన మహిళా ఎంపీలంతా కలిసి స్పీకర్‌కి ఫిర్యాదు చేస్తే.. డైవర్ట్‌ పాలిటిక్స్‌కు బీజేపీ పాల్పడుతుందని కాంగ్రెస్ కౌంటర్‌ ఇస్తోంది.

పార్లమెంట్‌లో వివాదాలకు కేరాఫ్‌ రాహుల్‌.. తాజాగా లోక్‌సభలో అవిశ్వాసంపై సీరియస్‌గా చర్చ జరుగుతున్నప్పుడు రాహుల్‌ గాంధీ అధికారపార్టీ వైపు చూస్తూ ఇచ్చిన ఫ్లయింగ్‌ కిస్‌ ఇప్పుడు సంచలనంగా మారింది. రాహుల్‌ తీరుపై దీనిపై భగ్గుమన్నారు బీజేపీ మహిళా ఎంపీలు. అవిశ్వాస తీర్మానంపై రాహుల్‌గాంధీ సభలో మాట్లాడుతూ అసభ్యంగా ప్రవర్తించారని స్పీకర్‌కు 21 మంది బీజేపీ మహిళా ఎంపీలు ఫిర్యాదు చేశారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వైపు చూస్తూ ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చారని ఆరోపించారు. రాహుల్‌పై చర్యలు డిమాండ్‌ చేశారు. గాంధీ కుటుంబం సభ్యులు మాత్రమే ఇలా చేయగలగరంటున్నారు స్మృతీ ఇరానీ. మొత్తం పార్లమెంట్‌లో ఉన్న మహిళా ఎంపీలను అగౌరవపరచడమేనన్నారు మంత్రి. ఇది రాహుల్‌ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని.. ఆయన ప్రవర్తన రోడ్డు మీద పోకిరీలలాగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే రాహుల్‌ గాంధీ ఎవరినీ ఉద్దేశించి ఫ్లయింగ్‌ కిస్‌ ఇవ్వలేదన్నారు. కావాలనే సభలో చర్చను మణిపూర్‌ అంశాన్ని పక్కదారి పట్టించడానికి బీజేపీ రాద్దాంతం చేస్తుందన్నారు. అయితే, రాహుల్‌ తీరే సెపరేట్‌.. గతంలోనూ మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టింది విపక్షం. అప్పుడు ఏకంగా మోదీ దగ్గరికి వెళ్లి ఆలింగనం చేసుకున్నారు రాహుల్ గాంధీ. అంతకుముందు మరోసారి సభలో కన్నుకొడుతూ కూడా రాహుల్ వివాదానికి తావిచ్చారు. మొత్తానికి సీరియస్‌ చర్చలో ఇప్పుడు ప్లయింగ్‌ కిస్‌ చుట్టూ రచ్చ నడుస్తోంది.

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ వీడియో..

మరిన్ని జాతీయ వార్తల కోసం..