Leading News Portal in Telugu

Minister KTR: జర ఆలోచించండి.. ఢిల్లీ పార్టీలను నమ్మొద్దు.. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు.. – Telugu News | Minister KTR Fires on Congress and BJP Parties over Telangana Development


ప్రజలను కడుపులో పెట్టుకొని చూసే KCR కావాలా? కుంభకోణాలా కాంగ్రెస్‌ కావాలా.. తేల్చుకోవాలంటూ మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు. తండ్రి వయస్సున్న KCR గురించి అడ్డుగోలుగా మాట్లాడే ఎంపీ అర్వింద్‌ నిజామాబాద్‌ను ఏమైనా అభివృద్ధి చేశారా..? నిజామాబాద్ ప్రజలు ఆలోచించాలంటూ కేటీఆర్ వివరించారు.

నిజామాబాద్, ఆగస్టు 9: ప్రజలను కడుపులో పెట్టుకొని చూసే KCR కావాలా? కుంభకోణాలా కాంగ్రెస్‌ కావాలా.. తేల్చుకోవాలంటూ మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు. తండ్రి వయస్సున్న KCR గురించి అడ్డుగోలుగా మాట్లాడే ఎంపీ అర్వింద్‌ నిజామాబాద్‌ను ఏమైనా అభివృద్ధి చేశారా..? నిజామాబాద్ ప్రజలు ఆలోచించాలంటూ కేటీఆర్ వివరించారు. నిజామాబాద్‌లో నిర్మించిన ఐటీహబ్‌, నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ను ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి KTR బుధవారం ప్రారంభించారు. ఐటీ హబ్‌ను పరిశీలించిన కొత్తగా నియమితులైన ఉద్యోగులతో కాసేపు మాట్లాడారు. 50 కోట్ల రూపాయలతో 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ హబ్‌ను నిర్మించారు. ఐటీ యువత ఆశలు, ఆకాంక్షలకు ప్రతిబింబిమని కేటీఆర్‌ అన్నారు.

ఆ తర్వాత నిజామాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన KTR రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు. KCRను అనే స్థాయి నిజామాబాద్‌ ఎంపీకి ఉందా అని ప్రశ్నించారు. ఎంపీగా నిజామాబాద్‌కు ఏమైనా అభివృద్ధి చేశారా అని నిలదీశారు. అటు, TPCC అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై కూడా మంత్రి కే తారక రామారావు ఘాటు విమర్శలు చేశారు. 50 ఏళ్లుగా తెలంగాణ ప్రజల‌ను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా మోసం చేసేందుకు య‌త్నిస్తోంద‌ని KTR మండిపడ్డారు.

ఢిల్లీ పార్టీలను నమ్మొద్దని కేటీఆర్‌ అన్నారు. మూడు పంటలకు నీళ్లిచ్చే KCR కావాలా? మూడు గంటల కరెంట్‌ ఇస్తామని చెప్తున్న కాంగ్రెస్‌ కావాలా తేల్చుకోవాలని ప్రజలను KTR కోరారు. ఢిల్లీ పార్టీ నాయకులు కూర్చొవాలన్నా, నిలబడాలన్నా ఢిల్లీ నుంచి పర్మిషన్ తీసుకోవాలని, కాని తమ పార్టీ బాసులు తెలంగాణ గల్లీల్లో ఉన్నారని KTR అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..