Leading News Portal in Telugu

Rahul Gandhi Speech: లోక్‌సభలో రాహుల్ ప్రసంగం వెనుక స్క్రిప్ట్‌ ప్లే చేసింది ఎవరో తెలుసా.. ఆమె అంటూ ప్రచారం.. – Telugu News | Rahul Gandhi’s speech: Mother Sonia Gandhi is writing the script for Rahul’s speech in the Lok Sabha


Rahul Gandhi Speech In Lok Sabha: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్నప్పుడు.. సోనియా గాంధీ ఆయనకు నిరంతరం మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు మాట్లాడాలి.. ఎలా మాట్లాడాలి.. ఎవరిని టార్గెట్ చేయాలి.. ఏ విషయం ఎప్పుడు ఎత్తాలి.. ఎప్పుడు తగ్గించాలి.. ప్రతి విషయంలో బుధవారం సభలో సోనియా డైరెక్షన్ కనిపించింది. ఇండియా పక్షాలను మొత్తం తన కంట్రోల్‌లోకి తెచ్చకున్నట్లుగా అక్కడ సీన్ స్పష్టం అయ్యింది. అసలు ఎప్పుడు రాహుల్‌ ప్రసంగిస్తున్నప్పుడు సోనియా ఎలా స్క్రిప్ట్‌ను ప్లే చేశారో చూద్దాం..

లోక్‌సభలో బుధవారం (ఆగస్టు 9) మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రసంగంపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాహుల్ ప్రసంగంలోని దూకుడు సర్వత్రా వినిపించింది. సభ లోపలా, బయటా అన్ని చోట్లా చర్చనీయాంశం అవుతోంది. అయితే ఈ ప్రసంగానికి మూలాధారం ఇవ్వడంలో ఎవరైనా ప్రత్యేక పాత్ర పోషించారంటే అది ఆయన తల్లి, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీయే అని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇండియా టుడేలో వచ్చిన ఒక కథనం ప్రకారం, రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రసంగిస్తున్నప్పుడు.. సోనియా గాంధీ ఎప్పటికప్పుడు ఆయనకు మార్గనిర్దేశం చేస్తూ కనిపించారు.

తద్వారా ఆయన మాటలు సరైన స్థలంలో ప్రభుత్వాన్ని తాకాయి. రాహుల్ ముందు వరసలో కూర్చున్నా సోనియాగాంధీ ఆయనకు సలహాలు ఇస్తూనే ఉన్నారు. అందుకే రాహుల్ కూడా తల్లి సలహాను అంగీకరించడంలో ఆలస్యం చేయలేదు. తన ప్రసంగం మొదలు పెట్టిన సమయం నుంచి మొదలు.. మధ్య మధ్యలో ఎలా మాట్లాడాలి.. ఏ సమయంలో ఎలా దాడి చేయాలో చెప్పడం కనిపించింది.

సోనియా గాంధీ కనుసన్నల్లో..

ఇండియా కూటమి సభ్యులు వెల్‌లో ఉన్నప్పుడు.. దూకుడు పెంచాలని సోనియా గాంధీ తన కుడివైపున కూర్చున్న కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు, టీఎంసీకి చెందిన మహువా మోయిత్రా విపక్షాలకు చెందిన బీజేపీ ఎంపీలపై అరవడం ప్రారంభించినప్పుడు.. వెంటనే సోనియా అలర్ట్ అయ్యారు. సోనియా గాంధీతో రంజన్ చౌదరి సమావేశం.. విపక్షాల వైపు నుంచి సీన్ మార్చింది. దీని తరువాత టీఎంసీ ఎంపీ స్వయంగా వెల్ నుంచి వైదొలిగి తమ స్థానాలకు తిరిగి రావాలని ఇండియా కూటమి సభ్యులను అభ్యర్థించారు రంజన్ చౌదరి.

రాహుల్ గాంధీ ప్రసంగంలో అత్యంత చర్చనీయాంశమైన భాగానికి.. ప్రసంగం చివరలో తన చేతిలో ఉన్న చిత్రాన్ని చూపించమని సోనియా గాంధీ రాహుల్‌ను కోరినప్పుడు మాత్రమే అతనికి తన తల్లి నుంచి సిగ్నల్ వచ్చింది. ఆ తర్వాత విమానంలో ప్రధాని మోదీ, పారిశ్రామికవేత్త గౌతం అదానీ కలిసి కూర్చున్న పాత చిత్రాన్ని రాహుల్ గాంధీ చూపించారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ, రావణుడు కేవలం ఇద్దరు వ్యక్తుల మాటలను వినేవాడు. మొదటి మేఘనాదుడు, రెండవ కుంభకర్ణుడు.. అలాగే, ప్రధాని మోదీ కూడా ఇద్దరు వ్యక్తుల మాటలను మాత్రమే వింటారు.. అమిత్ షా, గౌతమ్ అదానీ.

రాహుల్ ప్రసంగంలో తల్లిని..

మణిపూర్‌పై మాట్లాడుతున్న రాహుల్ గాంధీ తన ప్రసంగంలో తన తల్లిని కూడా ప్రస్తావించారు. అలాగే భారత్ మాత గురించి కూడా మాట్లాడారు. మణిపూర్ ప్రజలను చంపడం ద్వారా మీరు భారతదేశాన్ని చంపారు అని రాహుల్ అన్నారు. నువ్వు దేశద్రోహివి, మా అమ్మ ఇక్కడ కూర్చుని ఉంది. మణిపూర్‌లో రెండో తల్లి హత్యకు గురైంది అంటూ చెప్పడం వెనక సోనియా కంట్రోల్ ఉందని చర్చ జరుగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం