Leading News Portal in Telugu

ఉగ్రవాదం కాదు.. ప్రజాస్వామ్యమే.. రయీద్ మట్టు | quit terrorism prefer democracy| jammu| kashmir| mattu| rayeed| indipendence| day


posted on Aug 15, 2023 8:54AM

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒక ఉగ్రవాది సోదరుడు జాతీయ జెండా ఎగుర వేశారు. హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్టు జావేద్ మట్టూ సోదరుడు రయీస్ మట్టు జమ్మూ కాశ్మీర్ లోని సోసోర్ లో తన నివాసం వద్ద  మువ్వన్నెల జెండా ఎదురవేసి తన దేశ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి. రయీస్ మట్టూ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

వెంటనే అవి వైరల్ అవ్వడమే కాకుండా రయీస్ మట్టుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సోసోర్ లోని తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేసిన మట్టూ..  భారత పౌరులుగా తాము ఎంతో గర్వపడతామని, ఎప్పటికీ భారతీయులుగా ఉంటామన్నారు. ఆయన ప్రసంగానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. మట్లుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకడైన   జావెద్ మట్టూ సోదరుడు రయీస్ మట్టూ జమ్మూ కాశ్మీర్ లో అభివృద్ధి శకం మొదలైందనీ, దేశంలోని ఇతర ప్రాంతాలకు దీటుగా పురోగమిస్తోందనీ చెప్పారు.

కశ్మీర్ లో జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తన సోదరుడు కూడా ఉగ్రమార్గాన్ని వదిలి వెనక్కు రావాలని కోరారు. దేశ ప్రగతిలో కాశ్మీర్ భాగస్వామ్యం కొనసాగుతుందనీ, రాష్ట్రంలో ఉగ్రవాదం సమసిపోయి సౌభ్రాతృత్వం పరిఢవిల్లుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.  2009లో తన సోదరుడు ఉగ్రవాదిగా దారి తప్పాడనీ, అప్పటి నుంచీ అతడిని చూసింది లేదనీ చెప్పిన రయీస్ మట్టు, ఒక వేళ తన సోదరుడు  బతికుంటే తిరిగి ఉగ్రమార్గాన్ని విడిచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.  తాము నిజమైన భారతీయులుగా తమ మాతృభూమిలోనే నివసిస్తామని విస్పష్టంగా చెప్పారు.