జగన్ సర్కార్ ను ఇన్వెస్టర్లు నమ్మట్లే! | jagan sarkar lost investers belief| bewareges| bonds| investersm bse| listed
posted on Aug 17, 2023 3:07PM
జగన్ సర్కార్ పరువు గంగలో కలిసింది. ఏపీ ప్రతిష్ఠ మంట కలిసింది. రుణగొణ ధ్వని తప్ప రాష్ట్ర ప్రగతి, పురోగతి పట్టని జగన్ సర్కార్ కు ఇన్వెస్టర్లు దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. కేంద్రం అండతో పరిమితులు, నిబంధనలు తుంగలో తొక్కినా ఎటువంటి ఆంక్షలూ విధించకుండా అడిగినంత అప్పు ఇట్టే వచ్చేస్తుంటే జగన్ సర్కార్ ఇక ఆర్థిక అరాచకత్వంపై విపక్షాలు, ఆర్థిక రంగ నిపుణుల విమర్శలను పట్టించుకోవలసిన అవసరం ఏముంది అన్న నిర్ణయానికి వచ్చేసింది.
కేంద్రమే తన ఆర్థిక అవకతవకలను పట్టించుకోనప్పుడు ఇంక ఎవరు మాత్రం ఏం చేయగలరన్న ధీమాతో బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా భారీ రుణానికి టెండర్ వేసింది. అంటే ఆ కార్పొరేషన్ ద్వారా బాండ్లు విడుదల చేసి 11వేల 600 కోట్ల రూపాయలు ఖజానాలో జమ చేసుకోవాలని ఎత్తువేసింది. ఈ కార్పొరేషన్ ద్వారా బీఎస్ఈలో బాండు విడుదల చేసింది. అయితే ఈ బాండ్ల వైపు ఇన్వెస్టర్లు కన్నెత్తి చూడలేదు. సాధారణంగా ప్రభుత్వ బాండ్లను ఇన్వెస్టర్లు హాట్ కేకుల్లా తన్నుకుపోతారు. కానీ ఆ బాండ్లు విడుదల చేసింది జగన్ సర్కార్ కదా! జగన్ సర్కార్ ఆర్థిక క్రమశిక్షణపై ఒక్క రాష్ట్రంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మాండమైన గుర్తింపు ఉంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎడాపెడా అడ్డగోలుగా చేస్తున్న అప్పులను ఆదాయం పెంపునకు ఉపయోగించడం లేదు. అంటే ప్రాజెక్టులు నిర్మించడం లేదు. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలేదు. వచ్చే ఎన్నికలలో ఓట్లు తెచ్చిపెడతాయని భ్రమిస్తున్న సంక్షేమ పథకాల పేరిట బటన్ లు నొక్కి సొమ్ము పందేరానికి మాత్రమే ఉపయోగిస్తున్నది.
ఆ కారణంగానే జగన్ సర్కార్ విడుదల చేసిన బాండ్లకు ఇన్వెస్టర్లు పూచిక పుల్ల పాటి విలువ కూడా ఇవ్వలేదు. గత మే 15న కూడా ఏపీ సర్కార్ బాండ్లు విడుదల చేసింది. అయితే వాటిని లిస్ట్ చేయలేదు. ఆ కారణంగా ఇన్వెస్టర్లు దృష్టి పెట్టలేదని భావించి, ఈ సారి పక్క ప్రణాళికతో వ్యూహాత్మకంగా బేవరేజెస్ కార్పొరేషన్ బాండ్లను బీఎస్ఈలో లిస్టు చేసింది. ఇందు కోైసం ఓ సంస్థ ద్వారా ఏఏ+ రేటింగ్ ఇప్పించుకుంది. అ
యినా బాండ్లను సబ్‌స్ర్కైబ్ చేసుకోవడానికి ఇన్వెస్టర్లు సుముఖత చూపలేదు. ఏపీ ప్రభుత్వానికి చెందిన ఏపీసీఆర్‌డీఏ, ఏపీసీపీడీసీఎల్, పీఎ్‌ఫసీ ‘హా ఇతర ఎనర్జీ సంస్థల బాండ్లన్నీ బీఎస్ఈలో బీ రేటింగ్‌తో ట్రేడ్ అవుతుండగా, బేవరేజెస్ కార్పొరేషన్ బాండ్లకు ఏఏ+ రేటింగ్ ఎలా అని ఇన్వెస్టర్లు సందేహం వ్యక్తం చేశారు.