Leading News Portal in Telugu

తెలంగాణపై ఫోకస్ తో ఆ పార్టీకి ఫలితం ఉందా..?


posted on Aug 17, 2023 1:59PM

మరి కొద్ది నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెంచింది.  ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం. అభ్యర్థుల ఎంపికకు పరిగణనలోనికి తీసుకోవాలసిన అంశాలపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కీలక భేటిని నిర్వహించింది. ప్రధాని మోడీ, అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం కమిటీ సమావేశ మైంది. ఈ సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో అనుసరించాల్సిన విధానాలపై ప్రధానంగా చర్చించారు. ఎన్నికలు జరగనున్న తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై అగ్రనేతలు తీశారు. రాష్ట్రాల్లో పరిస్థితులపై వచ్చిన సమాచారం ఆధారం గా పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు రావడంతో  ఎన్నికలను బీజేపీ అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచార బాధ్యత లను ఎక్కువగా జాతీయ నాయకత్వమే తీసుకుని వ్యూహత్మకంగా ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒక్క మధ్యప్రదేశ్ వినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగనున్న  రాష్ట్రాలలో.. ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు అనుసరించాల్సిన వ్యహంపై ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. మధ్యప్రదేశ్ లో అధికారం నిలుపుకోవడంతోపాటు గతంలో అధికారంలో ఉన్న చత్తీస్ గఢ్,  రాజస్థాన్ లో ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గడ్ లలో హోరాహోరీగా ప్రత్యర్థి పార్టీలతో తలపడాల్సి రావొచ్చని సమావేశంలో నేతలు అన్నట్లు సమాచారం. ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరిగినట్లు తెలిసింది. ఎన్నికల బరిలో దింపాల్సిన అభ్యర్థులను ముందే గుర్తించి ప్రకటిస్తే తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం తోపాటు వ్యూహాత్మకంగా వ్యవహరించడానికి తగినంత సమయం ఉంటుందని అన్నట్టు సమాచారం.

సమయం దొరుకుతుం దని సమావేశం అభిప్రా య  పడితే ప్రత్యర్థి పార్టీలు అభ్యర్ధులను ప్రకటించిన తర్వాత బీజేపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని కమిటీ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి.  ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ పరిస్థితిపై కమిటీ ఆరా తీసినట్లు తెలిసింది. 

తెలంగాణ లో పాతుకు పోయిన బీఆర్ ఎస్.. జోష్ తెచ్చుకుని..పరుగులు పెడుతున్న  కాంగ్రెస్.. ల నడుమ.. బీజేపీ ..అధికార పీఠం ఎక్కుతోందా.. ప్రత్యర్థులను ఢీ కొట్టే దమ్ము ఉందా..? కాలమే సమాధానం చెబుతోంది.