Leading News Portal in Telugu

బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల | brs candidates 1st list releasw| disaccord| chances


posted on Aug 21, 2023 3:20PM

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే 105 మంది అభ్యర్ధులతో జాబితా ప్రకటించారు. కేసీఆర్ కు నమ్మకం ఉన్న ముహూర్తం ప్రకారం పంచమి తిథిలో ఈ జాబితాను విడుదల చేశారు. జాబితా విడుదల కు ముందు తెలంగాణ భవన్ వదర్ద, ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద హై డ్రామా నెలకొంది. ఎవరికి టికెట్ల దక్కుతాయి, ఎవరికి టికెట్లు దక్కవు అన్న ఉత్కంఠ ఆశావహుల్లో నెలకొంది. పార్టీ టికెట్ లభిస్తుందా, లభించదా అన్న అనుమానం ఉన్న వారు ఉరుకులు పరుగులు పెట్టారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు  హైదరాబాద్ లో అందుబాటులో లేకపోవడంతో ఆశావహులు మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవితలతో తమ విన్నపాలు చెప్పుకునేందుకు పోటీ పడ్డారు. కాగా అనుకున్న ముహూర్తానికి కేసీఆర్ అభ్యర్థుల జాబీతా ప్రకటించారు.  సిట్టింగులలో కేవలం నలుగురిని మాత్రమే మారుస్తున్నట్లు చెప్పారు. అలాగే తాను గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.   అసంతృప్తికి గురైన నేతలను ఎలా బుజ్జగించాలన్నదానిపై కేసీఆర్ దృష్టి సారించారు. ఇప్పటికే పలువురిని పిలిపించుకుని మాట్లాడారు. గతానికి భిన్నంగా ఈ సారి అసంతృప్తులను బుజ్జగించడానికి కేసీఆర్ ఎక్కువ సమయం తీసుకున్నారు. పోన్ లో టికెట్ దక్కని వారిని సముదాయించి భరోసా కల్పించారు.  

ఒకేసారి 105 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన కేసీఆర్.. నలుగురు సిట్టింగులకు మాత్రమే టికెట్ లేదని వెల్లడించారు. అలాగే మరో ఆరుస్థానాలను పెండింగ్ లో ఉంచినట్లు చెప్పారు. టికెట్ దక్కలేదని ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ, కార్పొరేషన్ చైర్మన్ వంటి పదవులు ఉంటాయన్నారు.  గతంలో లాగే ఈ సారి కూడా ఎంఐఎంతో కలిసే ఎన్నికలు వెడతామన్నారు.