Leading News Portal in Telugu

భర్తకు అరెస్టు వారెంట్ పై మంత్రి రోజా మౌనమేలనోయీ! | why roja silence on warrant| selwamani| arrest| chennai| court| netizens


posted on Aug 30, 2023 11:16AM

జగన్  కేబినెట్  మహిళా మంత్రుల్లో అసలు సిసలు ఫైర్ బ్రాండ్  పర్యాటక శాఖ మంత్రి  రోజా . ఈ విషయాన్ని  అధికార పార్టీలోని వాళ్లే కాదు.. ప్రతిపక్ష పార్టీ  నేతలు సైతం అంగీకరిస్తారు. అలాంటి   రోజా భర్త ఆర్కే సెల్వమణికి చెన్నైలోని జార్జిటౌన్ కోర్టు నాన్ బెయిల్‌బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే  తన భర్తకు వారెంట్ వచ్చి రెండు రోజులు గడుస్తున్నా రోజా  నుంచి ఎటువంటి స్పందనా లేదు.  దీంతో తన భర్తపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినా మంత్రి రోజా కనీసం స్పందించకపోవడంపపై  నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.  

 ముఖ్యమంత్రి వైయస్ జగన్‌పై ఈగ వాలితేనే ఆర్కే రోజు సహించలేరని.. అలాంటి ఆమె.. తన భర్త   సెల్వమణికి కోర్టు నాన్ బెయిల్ బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తే ఎందుకు స్పందంచడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఆగస్ట్ 28వ తేదీన ఆర్కే రోజా… తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరిలో సీఎం జగన్ విద్యా దీవెన పథకంలో భాగంగా బటన్ నొక్కే కార్యక్రమాన్ని నిర్వహించారని.. ఈ సందర్బంగా ఆ భారీ సభలో ఆర్కే రోజా మాట్లాడుతూ…. సీఎం జగన్‌ను  దేవుడిగా అభివర్ణిస్తూ చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ ఓ ఆటాడుకుంటున్నారు. సీఎం వైయస్ జగన్ ప్యూచర్ కి సీఎం అని   రోజా  ఆ ప్రసంగంలోపేర్కొన్నారనీ,  ఇంతకీ జగన్.. ఎవరి ప్యూచర్‌కి సీఎం అని వారు క్వచ్చన్ లు సంధిస్తున్నారు. అంతేకాదు.. ఓ వేళ ఆమె ప్యూచర్‌కే  జగన్ సీఎం అయితే అయి ఉండవచ్చని కూడా అంటున్నారు. 

అదీకాక… తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లు ఎవరైనా   జగన్‌ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తే.. కొన్ని సెకన్లలో…. అదీ శ్రీవారు కొలువైన తిరుమల? గణేషుడు కొలువున్న కాణిపాకమా?  సత్యదేవుడు నెలవున్న అన్నవరమా ?  లక్ష్మీ నరసింహుడి ఆవాసమైన సింహాచలమా? అనే విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా.. అలా మీడియా ముందుకు వచ్చి.. ఇలా ఆయా పార్టీల అధినేతలపై సినిమా డైలాగులతో,  ప్రాసలతో   రోజా చిందులు తొక్కుతారనీ.. అయినా.. తాను ఓ బాధ్యత గల మంత్రిని అని.. అదీ కూడా ఓ మహిళా మంత్రినన్న సోయి కూడా లేకుండా.. నాని బ్రదర్స్‌ లేడి అవతారం ఎత్తితే ఎలా మాట్లాడతారో.. అలా ఆమె మాట్లాడుతారని నెటిజన్లు పేర్కొంటున్నారు.   అయినా ప్రతీదానికి స్పందించే ఆర్కే రోజా.. భర్తకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయితే స్పందించకపోవడాన్ని బట్టి చూస్తే ఏక్కడో ఏదో తేడా కోడుతున్నట్లుగా ఉందనే  ఓ అనుమానాన్ని కూడా నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. 

ఇక చెన్నైలోని జార్జిటౌన్ కోర్టు రోజా భర్త సెల్వమణికి ఎందుకు నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ చేసిందంటే.. 2016లో ఓ తమిళ చానెల్‌కి సెల్వమణి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…  సినిమా ఫైనాన్షియర్ చంద్ బోత్రాని కించపరిచే విధంగా మాట్లాడారు. దీనిపై చంద్ బోత్రాసెల్వమణిపై కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. ఆ తర్వాత ఆయన  మరణించడంతో.. ఆయన కుమారుడు గగన్ బోత్ర ఈ కేసును కొనసాగిస్తున్నారు. ఆ క్రమంలో ఆ కేసు.. మరోసారి విచారణకు వచ్చింది. కానీ ఈ విచారణకు సెల్వమణి హాజరు కాలేదు. అలాగే ఆయన తరుఫు న్యాయవాదులు సైతం హజరుకాలేదు. దీంతో జార్జీ చౌన్ కోర్టు ఈ మేరకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.