కొండముచ్చుకి రాఖీ కట్టిన స్వయం సేవకులు! | swayam sevaks tie rakhee to monkey| raksha| bandhan| sister| brother| bond| ramayana
posted on Aug 31, 2023 3:48PM
శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి.. రాఖీ పౌర్ణమి. ఈ పర్వ దినాన్ని పురస్కరించుకొని.. కొండముచ్చుకు కొందరు స్వయం సేవకులు రాఖీ కట్టారు. వారిని సోదరులుగానే భావించిన ఆ కొండ ముచ్చు కూడా వారిపై దాడి చేయలేదు..అలాగని భయపడి పారిపోనూ లేదు.. అచ్చం మనిషిలాగానే వారి చేత రాఖీ కట్టించుకొంది. ఆ తర్వాత.. స్వయం సేవకులతో కాసేపు ఆ కొండముచ్చు ఆటలాడింది. హనుమాన్ ప్రతిరూపంగా భావించి ఆ కొండ ముచ్చుకు రాఖీ కట్టినట్లు స్వయం సేవకులు ఈ సందర్బంగా వెల్లడించారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా పెద్ద మంతనాల దోర్నాల మండలం ఖండ నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచుగూడెంలో చోటు చేసుకొంది. అయితే కొండ ముచ్చుకు స్వయం సేవకులు రాఖీ కట్టిన వీడియోలు, చిత్రరాజాలు… సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
ఇది కలికాలమే అయినా.. అందులోను ఇది మరీ కరెన్సీ కాలమైపోయిందని.. దీంతో బంధాలు, అనుబంధాలు ఇంకా ఎక్కడ ఉన్నాయని.. ఉన్నాదంతా ఆ ఒక్క రాఖీ పండగ రోజు మాత్రమేనని వారు పేర్కొంటున్నారు. అయితే కొండముచ్చు.. రామయణంలో అంజనేయుడిగా భావించి ఆ వానరం చేతికి స్వయం సేవకులు రాఖీ కట్టారంటే.. వారికి దైవత్వం మీద, దైవబలం మీద..అంతకు మించి రామాయణం కావ్యంపైన అపారమైన భక్తి శ్రద్దలు కలిగి ఉన్నాయని స్పష్టమవుతోందని వారు వివరిస్తున్నారు.
అంతేకాదు.. రామాయణం మహాకావ్యంలో కీలక పాత్ర ఏదైనా ఉందంటే.. అదీ హనుమంతుడిదేననీ, సీత ఎక్కడ ఉందో తెలుసుకోన్నదీ, రామ, రావణ యుద్ధంలో లక్ష్మణుడు ఆపస్మారక స్థితిలోకి వెళ్లితే సంజీవని పర్వతం తీసుకు వచ్చి.. లక్ష్మణుడిని బతికించింది కూడా ఈ ఆంజనేయుడేనని, అలాగే సుందరమైనది సుందరకాండ.. ఈ కాండకు అండాదండా అంతా ఆ వానరుడేనని నెటిజన్లు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు.
సోదరి, సోదరుల మధ్య బంధానికి… రక్త సంబంధీకుల మధ్య అనుబంధానికి అసలు సిసలు ప్రతీక రాఖీ పండగ. కాలక్రమంలో అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెమ్మల మధ్య సోదర భావం దాదాపుగా కనుమరగవుతోందని.. అందుకు సీజీవ సాక్ష్యాలుగా ఎన్నో ఉదాహరణలు కళ్ల ముందే కదలాడుతోన్నాయని వారు వివరిస్తున్నారు. తాజా ఉదాహరణ అంటూ జగన్, షర్మిలల ఉదంతాన్ని గుర్తు చేస్తున్నారు. అయినా.. స్వయం సేవకులు రాఖీ కట్టిన.. వారి చేత రక్షా బంధనం కట్టించుకొన్న కొండ ముచ్చు నిజంగా హనుమంతుడేనని నెటిజన్లు పేర్కొంటున్నారు.