Leading News Portal in Telugu

ఇస్రోలో విషాదం.. అంతరిక్ష ప్రయోగాలకు కౌంట్ డౌన్ చెప్పే గొంతు మూగవోయింది! | isro scientist valarmati no more| voice| count| down| chandrayaan3| rocket| abdulkalam


posted on Sep 4, 2023 11:08AM

చంద్రయాన్ 3 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఇస్ట్రో సైంటిస్టులు ఇప్పుడు విషాదంలో మునిగిపోయారు. ఇస్రో చేపట్టే అంతరిక్ష ప్రయోగాలకు కౌంట్ డౌన్ చెప్పే సైంటిస్ట్  వాలార్మతి కన్నుమూశారు. తీవ్రమైన గుండెపోటు వచ్చిన వాలార్మతి చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం (ఆగస్టు2)న తుది శ్వాస విడిచారు. ఆమె చివరి సారిగా చంద్రయాన్ 3 ప్రయోగ సమయంలో కౌంట్ డౌన్ చెప్పారు.

ఇదే కాక ఇస్రో చేపట్టిన ఎన్నో ప్రయోగాలకు ఆమె లైవ్ స్ట్రీమిగ్ కు తన గొంతునిచ్చారు.  ఇస్ట్రో ప్రయోగాలకు ఆమె గొంతు వినడంతో ఆమె దేశ ప్రజలందరికీ  సుపరిచితురాలైపోయారు. 1984లో ఇస్రోలో శాస్త్ర వేత్తగా చేరిన వలార్మతి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని తొలి సారిగా 2015 లో  అందుకున్నారు.  

చివరిసారిగా చంద్రయాన్‌-3 మిషన్‌ రాకెట్‌కు వలార్మతి కౌంట్‌డౌన్‌ చెప్పారు. వాలార్మతి మృతి పట్ల ఇస్రో శాస్త్ర వేత్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రాకెట్ కౌంట్ డౌన్ సమయంలో వలార్మతి గొంతు ఇస్రో ప్రయోగాలకు ఒక ఐకాన్ గా మారిపోయిందని, ఆమె దేశ ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఇస్ట్రో తన సంతాప సందేశంలో పేర్కొంది.