రోడ్డుపై బైఠాయించిన లోకేష్ | lokesh sat on road in protest| konaseema| podalada| babu| arrest| vijayawada| police
posted on Sep 9, 2023 8:13AM
తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన కుమారుడు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిరసనకు దిగారు. కోనసీమ జిల్లా కోనసీమ జిల్లా పొదలాడలో ఉన్న లోకేశ్ తండ్రి అరెస్టు వార్త వినగానే బెజవాడకు బయలు దేరారు. అయితే పోలీసులు ఆయనను అడ్డుకోవడంతో లోకేష్ రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు.
రాజోలు సీఐపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా తనను ఎలా అడ్డుకుంటారని నిలదీశారు. తన తండ్రి అరెస్టు అయితే కుటుంబ సభ్యుడిగా వెడుతున్న తనను అడ్డుకునే హక్కు మీకెవరిచ్చారని ప్రశ్నించారు. తాను ఒక్కడినే వెడుతున్నాననీ, వెంట ఎవరూ రావడం లేదనీ స్పష్టం చేశారు.
ఇలా ఉండగా పోలీసులు మీడియానే కాకుండా ఆహారం, నీరు కూడా లోకేష్ క్యాంప్ సైట్ లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పొదలాడలో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. జగన్ సర్కార్ నియంతృత్వానికి చంద్రబాబు అరెస్ట్, లోకేష్ ను బెజవాడ వెళ్లకుండా అడ్డుకోవడం పరాకాష్ట అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ పాలనలో రాష్ట్రం మొత్తం పోలీసు క్యాంపుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.