Leading News Portal in Telugu

చంద్రబాబు అరెస్టు.. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నేతలు హౌస్ అరెస్ట్ | chandrababu arres| state| wide| tdp| leaders| house| arres| hi| tenssion| babu| canvoy| nandyal| function


posted on Sep 9, 2023 7:51AM

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత  నారా చంద్రబాబు నాయుడిని  పోలీసులు అరెస్టు పోలీసులు అరెస్టు చేశారు.ప్రభుత్వ వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనను చంద్రబాబు నుంచి అరెస్టుకు సంబంధించిన పత్రాలపై సంతకాలు తీసుకున్నారు. నంద్యాలోని ఆర్‌.కె.ఫంక్షన్‌ హాల్‌ వద్ద ఆయన బస చేసిన బస్సులోనే ఆయనతో మాట్లాడిన డీఐజీ రఘురామ రెడ్డి ఆ సందర్భంగా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునాయుడు న్యాయవాదుల వద్ద స్టఫ్ లేదని వ్యాఖ్యానించి ఆ తరువాత ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు.

మొత్తం మీద చంద్రబాబును అరెస్టు చేసినట్లు ప్రకటించిన సీఐడీ పోలీసులు ఆయనను   స్కిల్ డెవలెప్‌మెంట్‌ కేసులో అరెస్టు చేసినట్లు ప్రకటించారు.  చంద్రబాబును  ఆయన కాన్వాయ్‌లోనే ఎన్‌ఎస్‌జీ భద్రతతో ఓర్వకల్లు విమానాశ్రయానికీ, అక్కడ నుంచి విజయవాడకు తరలించనున్నట్లు చెప్పారు. ఇలా ఉండగా చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వ వైద్యులు ఆయన హై బీపీ, సుగర్ ఉందని పేర్కొన్నారు. దీనిపై చంద్రబాబు తరఫు న్యాయవాదులు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. అదలా ఉంటే తొలుత శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత నంద్యాలలో చంద్రబాబు బసచేసిన ఫంక్షన్ హాల్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.  అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగేదేశం ముఖ్యనాయకులు, కార్యకర్తలను హౌస్ అరెస్టు చేశారు.  ఐటీ నోటీసుల కేసులో చంద్రబాబును అరెస్ట్‌ చేస్తారని మొదట ప్రచారం జరిగినప్పగటికీ, ఆ కేసులో షోకాజ్‌ నోటీసు మాత్రమే వచ్చినందున అరెస్ట్‌ చేసే అవకాశం లేదని, అన్నమయ్య జిల్లా అంగళ్లు దాడి ఘటనలో ఆయన్ను అరెస్ట్‌ చేస్తున్నారనీ అంటున్నారు.

మొత్తంగా చంద్రబాబు అరెస్టుకు జగన్‌ సర్కార్ పావులు కదుపుతున్న తీరు కుట్రపూరితంగాఉందని, ఆయన అరెస్టుకు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత పోలీసులు రావడమే ఇందుకు నిదర్శనమని తెలుగుదేశం శ్రేణులు చెబుతున్నాయి  ఎందుకంటే శని, ఆదివారాలు కోర్టుకు సెలవు. కేసులో మోపిన అభియోగాల తీవ్రత దృష్ట్యా మేజిస్ట్రేట్‌ ఇంటి వద్ద చంద్రబాబును హాజరు పరిచినా అప్పటికప్పుడు బెయిలు మంజూరయ్యే అవకాశాలున్నాయా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.   అదలా ఉండగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి నంద్యాలలో హైటెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. సమయం గడిచే కొద్దీ  రాష్ట్ర వ్యాప్తంగా ఈ టెన్షన్ వ్యాపించింది. నంద్యాల చంద్రబాబు బసచేసిన ఫంక్షన్ హాల్ వద్దకు పోలీసులు చేరుకున్న వార్త తెలిసిన క్షణాలలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. నంద్యాల నుంచే కాకుండా చుట్టుపక్కన జిల్లాల నుంచి కూడా తెలుగుదేశం నాయకులు నంద్యాల ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకున్నారు.   

ఇలా ఉండగా చంద్రబాబును అరెస్టు చేస్తున్నామంటూ పోలీసులు చూపిన ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు లేదని న్యాయవాదులు డిఐజీని ప్రశ్నించగా, అన్ని పత్రాలూ ఉన్నాయనీ, హైకోర్టుకు సమాచారం ఇచ్చామనీ చెప్పారు. అరెస్టు తరువాత అన్ని వివరాలూ చెబుతామంటూ మాట దాటేశారు.జగన్ ప్రభుత్వం తనను ఏదో విధంగా అరెస్టు చేయడానికి కుట్ర పన్నుతోందన్న అనుమానాన్ని చంద్రబాబు మూడు రోజుల కిందటే వ్యక్తం చేశారు.  ఆయన అనుమానించినట్లే నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు బస చేసిన ఫంక్షన్ హాల్ వద్దకు పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. ఇక అప్పటి నుంచీ శనివారం తెల్లవారే వరకూ హైడ్రామా కొనసాగింది.

ఊహాగానాలే తప్ప అసలు చంద్రబాబును ఏ కేసులో అరెస్టు చేస్తున్నారన్నది కూడా పోలీసులు చెప్పడానికి వెనుకాడారు.  చంద్రబాబును  ఎలాగైనా జైలుకు పంపాలన్న ప్రభుత్వాధినేత జగన్ ఆదేశాన్ని శిరసావహించేందుకు పోలీసులు అధికారాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేశారని తెలుగుదేశం శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి.  డీఐజీతో చర్చల సందర్భంగా చంద్రబాబు తాను తప్పు చేస్తే నడి రోడ్డులో ఉరి తీయాలని   కానీ చేసిన తప్పేంటో .. కేసేంటో చెప్పకుండా అరెస్ట్ కు ప్రయత్నించడం ఏమిటన్ననియంతృత్వం కాకమరేమిటని చంద్రబాబు, నిలదీశారు. అయితే డీఐజీ మాత్రం వివరాలన్నీ  రిమాండ్ రిపోర్టులో ఉన్నాయని చెప్పుకొచ్చారు. సర్వ విలువలనూ, నిబంధనలనూ తుంగలో తొక్కి చంద్రబాబును అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు చంద్రబాబు న్యాయవాదులు తమను చుట్టుముట్టి బెదరిస్తున్నారంటూ ఎదురు ఆరోపణలు చేయడం అందరినీ విస్మయపరిచింది. అయితే పోలీసుల వితండ వాదనకు చంద్రబాబు న్యాయవాదులు దీటుగా బదులిచ్చారు మా హక్కుల గురించి ప్రశ్నిస్తే… బెదిరించడం ఎలా అవుతుదని నిలదీశారు. మొత్తం మీద గంటల తరబడి సాగిన హై డ్రామా అనంతరం చంద్రబాబును పోలీసులు అరెస్టు చేసి ఆయన కాన్వాయ్ లోనే ఓర్వకల్లు విమానాశ్రయానికి తరలించారు.