Leading News Portal in Telugu

చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు.. ఆయన తప్పు చేయరు.. లోకేష్ కు రజనీకాంత్ ఫోన్ | babu great warrior rajani phone to lokesh| will| come| safe| nver


posted on Sep 13, 2023 4:10PM

సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఆయనకు దేశ విదేశాల్లో అభిమానులు ఉన్నారు. ఆయనను అందరూ అజాత శత్రువుగా చెబుతారు. అందరితో మంచిగా ఉంటారు. పరుష వాక్యం అన్నది ఆయన నోటి నుంచి రాదు.  రాజకీయాలలోకి ఎంట్రీ ఇద్దామని ఆయన భావించి కూడా రాజకీయాలు తన నైనాజికి సరిపడవన్న భావనో ఏమో ఆ యోచన నుంచి విరమించుకున్నారు.

అటువంటి రజనీకాంత్ ను ఏపీలోని అధికార వైసీపీ వివాదంలోకి లాగింది. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఎన్టీఆర్ ను యుగపురుషుడిగా, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడిని విజనరీగా అభివర్ణించారు.  చంద్రబాబు కారణంగానే హైదరాబాద్ లో  ఐటీ అభివృద్ధి చెందిందన్నారు. హైదరాబాద్ వెళితే భారతదేశంలో ఉన్నామా? న్యూయార్క్ లో ఉన్నామా? అనిపించేలా అభివృద్ధి జరిగిందనీ, అందంతా చంద్రబాబు విజన్ వల్లే సాధ్యమైందన్నారు. చంద్రబాబుతో తనకు మూడు దశాబ్దాల స్నేహబంధం ఉందనీ, తన ప్రతి పుట్టిన రోజుకూ చంద్రబాబు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతారనీ రజనీకాంత్ ఆ సందర్భంగా చెప్పారు. ఆ ప్రసంగంలో రజనీకాంత్  ఎక్కడా రాజకీయ వ్యాఖ్యలు చేయలేదు. కానీ చంద్రబాబును ప్రశంసించడమే ఆయన చేసిన పాపం అన్నట్లుగా  వైసీపీ రజనీకాంత్ పై విమర్శల వర్షం కురిపించింది. మంత్రి రోజా, మాజీ మంత్రి కొడాలి నాని, నటుడు కం  పొలిటీషియన్ పోసాని కృష్ణ మురళి వంటి వారు రజనీకాంత్ పై అనుచిత వ్యాఖ్యలతో విమర్శలు గుప్పించారు. నువ్వు హీరోవా అంటూ హేళన చేశారు. దేశ విదేశాల్లో ఉన్న రజనీకాంత్ అభిమానులందరికీ ఆగ్రహం కలిగించారు. అయినా అప్పటికి రజనీకాంత్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ మేధావులూ, సామాన్యులూ కూడా రజనీకాంత్ పై వైసీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను తప్పుపట్టారు.  అయితే అప్పటికి ఊరుకున్న రజనీకాంత్ తన చిత్రం జైలర్ సినిమా వేడుకలో  మాత్రం ‘మొరగని కుక్కలేదు.. విమర్శించని నోరు లేదు.. ఇవి రెండూ జరగని ఊరు లేదు.. మనం మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి.. అర్థమైందా రాజా?” అంటూ వైసీపీ వారికి చురకలు అంటించారు.  

మొదటి వాక్యాలను తమిళంలో చెప్పిన రజినీకాంత్.. చివరిలో మాత్రం ‘అర్థమైందా రాజా’ అని తెలుగులో చెప్పడం విశేషం. పోసాని మాట్లాడితే ‘రాజా రాజా’ అంటుంటారు. అందుకే పోసాని శైలిలోనే అర్థమైందా రాజా అంటూ వైసీపీ నాయకులకు రజినీ చురకలు అంటించారనే చర్చ అప్పట్లో జోరుగా సాగింది కూడా. మొత్తం మీద అలుంగుటయే ఎరుగని రజనీ కాంత్ కూడా వైసీపీ తీరుపై సౌమ్యంగానైనా గట్టి రిటార్డ్ ఇచ్చారు. అటువంటి రజనీకాంత్ ఇప్పుడు చంద్రబాబు అరెస్టు పై స్పందించారు. తన మిత్రుడు చంద్రబాబు  గొప్ప పోరాట యోధుడు అని, ఆయన ప్రజా శ్రేయస్సుకోతం నిరంతరం పరితపించే గొప్ప నాయకుడు అని ప్రశంసించారు.

చంద్రబాబు కుమారుడు లోకేష్ కు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు ఆయనను ఏం చేయలేవని పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఆయనకు శ్రీరామరక్ష అంటూ లోకేష్ కు ధైర్యం చేప్పారు.  తన స్నేహితుడు చంద్రబాబు తప్పు చేయరని, ఆయన చేసిన మంచి పనులు, నిస్వార్థ ప్రజా సేవే ఆయనను క్షేమంగా బయటకు తీసుకువస్తాయన్నారు.