Leading News Portal in Telugu

మాజీ మంత్రి  గౌతు శివాజీ అరెస్ట్  పలాస లో ఉద్రిక్తత


posted on Sep 15, 2023 2:38PM

వైసీపీ ప్రభుత్వ  అరాచకాలు రోజు రోజుకి శృతిమించుతున్నాయి.  

 మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ , రిమాండ్ కు చట్టవిరుద్దమని టీడీపీతో బాటు ఎన్డియే, ఇండియా కూటమిలకు చెందిన భాగస్వామ్య పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. 

ఈ అరెస్ట్  ను నిరసిస్తూ మాజీ మంత్రి గౌతు శివాజీ   నేత‌ృత్వంలో పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. 

ఈ ఆందోళనను భగ్నం చేయడానికి జగన్ ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి శివాజీని ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేసారు. పోలీసుల దురుసు ప్రవర్తనతో గౌతు శివాజీ అస్వస్థకు గురయ్యారు. ఆ వివరాలేంటో చూద్దాం…

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టు ఖండిస్తూ 3వ రోజు పలాస కేటి రోడ్లో రీలే నిరాహార దీక్షను టీడీపీ శ్రేణులు చేపట్టారు. దీక్షకు సంఘీభావం తెలుపుతున్న మాజీ మంత్రి గౌతు శివాజీ ను కాశిబుగ్గ పోలీసులు అరెస్ట్ చేసి  పోలీస్ స్టేషన్ కు  తరలించారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. దీంతో గౌతు శిరీష, టిడిపి నాయకులు నినాదాలు చేస్తూ ర్యాలీగా కాశిబుగ్గ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.మాజీ మంత్రి గౌతు శివాజీ పోలీస్ స్టేషన్లో అస్వస్థకు గురు కావడంతో తక్షణమే వైద్యం నిమిత్తం కాశీబుగ్గలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.అస్వస్థకు గురైన మాజీ మంత్రి గౌతు శివాజీ కి వైద్యం పేరుతో గుర్తుతెలియని ప్రాంతానికి పోలీసులు తరలింపు….కాశిబుగ్గ పోలీస్ స్టేషన్ ఎదుట గౌతు శిరీష, టిడిపి నాయకులు, కార్యకర్తలు ఆందోళన శివాజీ ఆచూకీ తెలియకపోవడం  పోలీసులకు అడిగిన చెప్పకపోవడంతో శిరీష టిడిపి నాయకులు స్టేషన్ వద్ద ఆందోళన చేపడుతుండగా శిరీష తండ్రి ఆరోగ్య పరిస్థితి పై ఆందోళన చెందుతూ వినిపిస్తున్నారు