Leading News Portal in Telugu

బ్రింగ్ ఇట్ ఆన్.. లోకేష్ చాలెంజ్ కు జగన్ మైండ్ బ్లాక్ | bring it on lokesh powerful answer to rtv| live| debate| challange| jagan| babu| arrest| national


posted on Sep 16, 2023 4:26PM

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇప్పుడు జాతీయ స్థాయిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఔను.. జాతీయ మీడియాతో  లోకేష్ వరుస భేటీలు జరుపుతున్నారు.  ఇంటర్వ్యూలలో, లైవ్ డిబెట్లతో అదరగొడుతున్నారు. సూటిగా, సుత్తి లేకుండా పాయింట్ టు పాయింట్ అన్నట్లుగా లోకేష్ మాట్లాడుతున్న తీరు.. ఆర్.టివిఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ తో లైవ్ డిబేట్ లో,  ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయ్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన తీరు.. జాతీయ స్థాయిలో ఆయన స్థాయిని పెంచింది. 

ఇంత కాలం చంద్రబాబు నాయుడి తనయుడిగా మాత్రమే చూసిన జాతీయ నాయకత్వం ఇప్పుడు ఆయనను పరిణతి చెందిన నేతగా గుర్తించక తప్పదని చెబుతున్నారు. తన యువగళం పాదయాత్ర ద్వారా ఇప్పటికే ఆయన తానేమిటో, తన సమర్ధత, సత్తా ఏమిటో రాష్ట్ర ప్రజలకు చాటారు. రాజకీయంగా తొలి అడుగులు వేస్తున్న సమయంలోనే నారా లోకేష్ లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీ ఆయనను టార్గెట్ చేసి ట్రోల్ చేసింది. బాడీ షేమింగ్ చేసింది. ఆయన అలవాట్లను కూడా ఎగతాళి చేసింది. పప్పు అంటూ హేళన చేసింది. అయితే వాటన్నిటినీ అధిగమించి నాడు ఎగతాళి చేసిన వారే ఇప్పుడు ఆయన నాయకత్వ పటిమను ప్రశంసించక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు నారా లోకేష్ తెలుగుదేశం భవిష్యత్ నేత.. ఒక ప్రత్యేక గుర్తింపు సాధించిన యువనాయకుడు. యువగళం పాదయాత్ర ద్వారా ఆయన ప్రజలతో మమేకమౌతున్న తీరు మేధావుల నుంచీ సామాన్యల వరకూ అందరి ప్రశంసలూ అందుకుంది. 

అదంతా ఒకెత్తయితే.. పార్టీ అధినేత చంద్రబాబును స్కిల్ స్కాం కేసులో అక్రమంగా అరెస్టు చేసిన నాటి నుంచీ ఆయనలోని నాయకత్వ పటిమను, సంక్షోభాలను సమర్ధంగా ఎదుర్కొని.. వాటిని అధిగమించడమే కాకుండా సానుకూలంగా మార్చుకోవడంలో చూపిన నైపుణ్యం పరిణతిని బయటకు తీసుకువచ్చింది.   ప్రతి విషయంపైనా ఆయనకు ఉన్న సాధికారతను ప్రపంచం కళ్లకు కట్టింది. జాతీయ స్థాయి మీడియా ఆయన ఇంటర్వ్యూల కోసం, ఆయనతో లైవ్ డిబేట్ల కోసం క్యూకట్టేలా చేసింది. తన తండ్రి, పార్టీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేందుకు హస్తిన చేరుకున్న ఆయన ఇప్పుడు నేషనల్ మీడియాకు కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు. దీంతో జాతీయ మీడియాలో ఆయనను ఇంటర్వ్యూ చేయకపోతే వెనుకబడిపోతామన్న భావన  వ్యక్తం అవుతోంది. అందుకే ఆర్టీవీ, ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి మీడియా సంస్థలు ఆయనతో ముఖాముఖీ కార్యక్రమాలను నిర్వహించింది.  కేవలం రెండు రోజులలోనే  జాతీయ స్థాయిలో ప్రముఖ మీడియా సంస్థలన్నీ లోకేష్ తో లైవ్ డిబేట్లు, ఇంటర్వ్యూలూ ప్రసారం చేశాయి. 

ఇలా  మీడియా ఇంటర్వ్యూలలో బిజీబిజీగా ఉంటూనే మరో వైపు త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో పార్టీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశా నిర్ధేశం చేశారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశానికి అధ్యక్షత వహించారు. అలాగే జాతీయ స్థాయిలో అన్న రాజకీయ పార్టీల మద్దతూ కూడగడుతూ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో  చంద్రబాబుు అక్రమ అరెస్టును ఖండిస్తూ అన్ని రాజకీయ పార్టీలూ గళమెత్తేలా  వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. 

ఇంతటి బిజీ షెడ్యూల్ లోనూ.. ఎక్కడా ఆయన ముఖంలో అలసట అనేదే కనిపించడం లేదు. ఆర్.టివి ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ తో లైవ్ డిబేట్ అంటే మహా మహా సీనియర్ నేతలే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు.  తన ప్రశ్నలతో నాయకులను ఉక్కిరిబిక్కిరి చేసి వారిని ఇబ్బందుల్లోకి నెట్టే లక్ష్యంతోనే ఆయన లైవ్ షోలు ఉంటాయని ప్రతీతి. సమాధానం ఇచ్చే అవకాశం లేకుండా తన అరుపులు, ప్రశ్నల మీద ప్రశ్నలతో ఎటువంటి నేతనైనా డిఫెన్స్ లో పడేయడం అర్నాబ్ స్టైల్ అని పరిశీలకులు సైతం చెబుతుంటారు. అటువంటి అర్నాబ్ లైవ్ షోలో లోకేష్ ఎక్కడా తడబడకుండా,  ఆర్నాబ్ సంధించిన ప్రశ్నలకు లోకేష్ సమాధానం చెప్పిన తీరు  రాజకీయ పరిశీలకులనూ, రాజకీయ పండితులనూ మెప్పించింది.  తండ్రి చంద్రబాబు ను మించిన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయని పరిశీలకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.  

 ముఖ్యంగా వైసీపీ నేతలతో చర్చ విషయంపై అర్నాబ్ అడిగిన ప్రశ్నకు లోకేష్ బదులిచ్చిన విధానం ఆయనలోని ఆత్మ విశ్వాసానికీ, తన తండ్రి తప్పు చేయడన్న ధీమాకూ దర్పణం పట్టింది.  అన్నీ తెలిసీ ఏమీ తెలియనట్లు నటించే దద్మమ్మలతో తాను మాట్లాడనన్న లోకేష్.. జగన్ తో డిబేట్ కు సిద్ధమా అన్న అర్నాబ్ ప్రశ్నకు బ్రింగ్ ఇట్ ఆన్ అని ఒక్క ముక్కతో బదులిచ్చారు. నేరుగా జగన్ కే సవాల్ విసిరారు. ఇప్పుడు లోకేష్ అన్న బ్రింగ్ ఇట్ ఆన్ అన్న మాట నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు జగన్ ను ట్రోల్ చేస్తున్నారు. జాతీయ మీడియాలో లోకేష్ తో ఓపెన్ డిబేట్ కు జగన్ సిద్ధమా అంటూ నెటిజన్లు సవాల్ విసురుతున్నారు.  మాట తప్పడం..మడమ తిప్పడం మాత్రమే తెలిసిన జగన్ ఈ సవాల్ ను స్వీకరించే ధైర్యం చేయరని ముక్తాయిస్తున్నారు.