Leading News Portal in Telugu

రాజమహేంద్రవరం జైలులోనే విచారణ.. ఏసీబీ కోర్టు విస్పష్ట ఆదేశం | babu to be inquired in rjy central jail| acb| court| condition| advocates|present| only| two


posted on Sep 22, 2023 3:25PM

ఏసీబీ కోర్టు తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని సిల్ స్కామ్ కేసులో రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ గురువారం (అక్టోబర్22)న ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కొన్ని షరతులు విధించింది.

చంద్రబాబునాయుడిని రాజమహేంద్రవరం జైలులోనే విచారించాలనీ, ఆయనను మరో చోటుకు తరలించడానికి వీల్లేదని షరతు విధించింది. కాగా సీఐడీ చంద్రబాబును ఐదురోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలని కోరినప్పటికీ  ఏసీబీ కోర్టు మాత్రం రెండు రోజులకు మాత్రమే అనుమతించింది. అలాగే చంద్రబాబు తరఫున ఇద్దరు న్యాయవాదులు కూడా విచారణ సమయంలో ఉండేందుకు అనుమతించింది.

అదే విధంగా  ఉదయం 9 నుంచి సాయంత్రం ఐదు వరకూ మాత్రమే విచారించాలని ఆదేశించింది. ఇక విచారణను వీడియోరికార్డింగ్ చేయాలని ఆదేశిస్తూనే..  సంబంధించి ఫొటోలు, వీడియోలూ లీకు కాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది.  విచారణకు సంబధించిన పూర్తి వివరాలను సీల్డ్ కవర్ లో అందజేయాలని ఏసీబీ కోర్టు తన ఆదేశాలలో పేర్కొంది.