posted on Sep 22, 2023 3:08PM
స్కిల్ స్కామ్ కేసులో అరెస్టైన చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై విజయవాడ సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. సీఐడీ ఐదురోజుల కస్టడీ కోరగా సీబీఐ కోర్టు చంద్రబాబును రెండు రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
రాజమహేంద్రవరం జైలులోనే చంద్రబాబును విచారణ చేయాలని న్యాయమూర్తి ఆ ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొన్నారు. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ్ అగర్వాల్ వాదనలు వినిపించగా, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించిన విషయం తెలిసిందే.
అంతకు ముందు చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఉత్తర్వుల అనంతరమే సీబీఐ కస్టడీ పిటిషన్ పై తీర్పు వెలువరిస్తానని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చెప్పిన సంగతి విదితమే. ఇందు కోసం విచారణ పూర్తై గురువారం ఉదయం (సెప్టెంబర్ 21)కస్టడీ పిటిషన్ పై తీర్పు వెలువడాల్సి ఉండగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పును నేటి ఉదయానికి, ఆ తరువాత మధ్యాహ్నం రెండున్నరకు వాయిదా వేశారు.
కాగా శుక్రవారం (అక్టోబర్ 22) మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో చంద్రబాబును సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది.