తిరుమల శ్రీవారి దర్శనానికి 30 గంటలు | devotees rush in tirumala| compartments| full| pilgrims| tonsures| hundi
posted on Sep 30, 2023 9:05AM
తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతోంది.
శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఆక్టోపస్ బిల్డింగ్ వరకూ సాగింది. ఇక శుక్రవారం శ్రీవారిని 66వేల 233 మంది దర్శించుకున్నారు.
వారిలో 36వేల 486 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 71లక్షల రూపాయలు వచ్చింది.