Leading News Portal in Telugu

సత్యాగ్రహం.. జైలులో చంద్రబాబు, హస్తినలో లోకేష్, రాజమహేంద్రవరంలో భువనేశ్వరి నిరాహార దీక్ష | babu bhuwaneswari lokesh satyagraha| fast| one| day| jail| rajamahendravaram| delhi


posted on Oct 2, 2023 10:03AM

జాతిపిత మహాత్మాగాంధీ ప్రపంచానికి అందించిన మహా ఆయుధం సత్యాగ్రహం. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా గాంధీ జయంతి రోజున ఆయన బాటలో నిరాహారదీక్ష చేపట్టాలని తెలుగుదేశం నిర్ణయించింది. ఇందులో భాగంగానే రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, హస్తినలో నారా లోకేష్, రాజమహేంద్రవరం క్యాంపు సైట్ లో నారా భువనేశ్వరి నిరశన దీక్ష చేస్తున్నారు.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు, శ్రేణులు కూడా నిరశన దీక్ష చేపడుతున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణలోనూ తెలుగుదేశం నిరసన దీక్షలు చేపట్టింది. గాంధేయ పద్ధతుల్లో చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా గాంధీ జయంతి రోజున దేశ విదేశాల్లో తెలుగుదేశం అభిమానులు, ప్రజాస్వామ్య వాదులు ఒక రోజు నిరాహాద దీక్ష చేస్తున్నారు.  చంద్రబాబును జగన్ రెడ్డి సర్కార్ అక్రమంగా, అరెస్టు చేసిన రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తున్న ప్రజాగ్రహాన్ని ప్రజాస్వామ్య పద్దతిలో ప్రణాళికాబద్ధంగా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీ  మోత మోగిద్దాం అంటూ ఇచ్చిన పిలుపునకు అనూహ్య ప్రజా స్వందన వచ్చింది.  జనబాహుల్యం స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి మద్దతు పలకడం, వారి, వారి పని ప్రదేశాల్లోనే ఈలలు, డప్పులు, పళ్లేలతో మోతమోగించడం పరిశీలకులను సైతం ఆశ్చర్యపరిచింది.

చంద్రబాబు అరెస్టు, గత 23 రోజులుగా జైల్లో ఉంచడం, న్యాయస్థానాలలో ఆయన పిటిషన్లు వాయిదాల మీద వాయిదాలు పడుతుండటంతో జనాగ్రహం రోజు రోజుకూ ఇనుమడిస్తోంది. చంద్రబాబుకు మద్దతు పెరుగుతోంది. తమ ఆగ్రహాన్నీ, నిరసనను వ్యక్తం చేయడానికి తెలుగుదేశం ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా మద్దతుగా ఉప్పెనలా కదిలేందుకు జనం సిద్ధంగా ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వరుస కార్యక్రమాలతో జనంలో వెల్లువెత్తుతున్న ఆగ్రహాగ్ని చల్లారకుండా ఉండేందుకు వరుస కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని తెలుగుదేశం భావిస్తున్నది.

అందులో బాగంగానే గాంధీ జయంతి రోజున చేపట్టిన నిరశన దీక్ష కార్యక్రమంలో జనం పెద్ద ఎత్తున పాల్గొనేలా ప్రణాళికలు రచిస్తున్నది.  ఇక మంగళవారం సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణను జస్టిస్ అనిరుద్దబోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ముందుకు విచారణకు రానుంది. చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తారు. కాగా ప్రభుత్వం ఇప్పటికే చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువరించడానికి ముందు తమ వాదన కూడా వినాలంటూ కేవియట్ దాఖలు చేఃసింది. ఇలా ఉండగా మంగళవారం ఉదయం రాజమహేంద్రవరంలో జాతిపిత గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నారా భువనేశ్వరి క్వారీ సెంటర్‌ సమీపంలో ఏర్పాటు చేసిన దీక్షాస్థలి వద్ద  సత్యమేవ జయతే  దీక్ష ప్రారంభించారు. సాయంత్రం ఐదు గంటల వరకూ దీక్ష చేస్తారు. అనంతరం ఆమె ప్రసంగిస్తారు. భువనేశ్వరితో పాటు దీక్షలో పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.