Leading News Portal in Telugu

తెలుగు రాష్ట్రాల్లో తటస్థులు డిసైడైపోయారు! అందరి నోటా ఐయామ్ విత్ బాబు మాట! | neutrals decided in telugu states| political sceneria| changed| tdp| strengthen| bjp| telangana| lost| stake| brs| huge


posted on Oct 3, 2023 11:03AM

ఎన్నికలు హోరాహోరీ జరుగుతే జయాపజయాలను నిర్ణయించేది తటస్థుల ఓట్లే అని అంటారు. ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీయే, ఇండియా (కొన్ని మీడియా సంస్థలు ఇఎన్డిఐ అలయెన్స్ అంటున్నాయి) కూటముల మధ్య హోరా హోరీ పోరు తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఏ కూటమి వైపు తటస్థులు మొగ్గు చూపితే ఆ కూటమి విజయం సాధిస్తుందన్న మాట. అలాగే రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలలో కూడా తటస్థుల మొగ్గే ఏ రాష్ట్రంలోనైనా తదుపరి ప్రభుత్వం ఎవరిదన్నది నిర్ణయిస్తుంది.

అయితే తెలుగు రాష్ట్రాలలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ  ఒకే ఒక్క సంఘటన తటస్థులనే వారే లేకుండా చేసింది. ఔను ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో తటస్థులు లేరు. స్కిల్ కేసులో తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని అక్రమ అరెస్టును నిరసిస్తూ దేశ వ్యాప్తంగానే కాకుండా విదేశాలలో సైతం గత పాతిక రోజులుగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు విపక్ష నేతగా సేవలందించిన నాయకుడిని ఆధారాలు లేకుండా, కేవలం ఆరోపణలతోనే అక్రమంగా అరెస్టు చేయడం పట్ల సర్వత్రా ఆగ్రహజ్వాలలు ఎగసి పడుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేదేశ్ ముఖ్యమంత్రిగా తొమ్మిది సంవత్సరాలు, విభజిత ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఐదేళ్లు పని చేసిన చంద్రబాబు తాను సీఎంగా ఉన్న సమయంలో అమలు చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలు, అనితర సాధ్యమైన దార్శనికతతో ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రస్తావిస్తూ అటువంటి నేత అక్రమ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ తటస్థులు ఒక నిర్ణయం తీసేసుకున్నారు. అందుకే తెలుగు రాష్ట్రాలలో తటస్థులు బేషరతుగా తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అందుకే చంద్రబాబు అరెస్టు తరువాత రోజు రోజుకూ తెలుగురాష్ట్రాలలో తెలుగుదేశంకు మద్దతు పలుకుతున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తున్నది. అదే సమయంలో ఆయా రాష్ట్రాలలో ఉన్న అధికార పార్టీపై, ప్రభుత్వంపై జనాగ్రహం పెల్లుబుకుతోంది.

ముందుగా తెలంగాణ విషయానికి వస్తే.. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. తొలుత ఐటీ  ఉద్యోగులతో మొదలైన నిరసనల పర్వం.. ఆ తరువాత సమాజంలోని అన్ని వర్గాలలోనూ కనిపించింది. రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ కూడా చంద్రబాబు అరెస్టును ముక్తకంఠంతో ఖండించాయి. అలా ఖండించిన పార్టీలలో తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఉన్నాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీల ఖండనలు పార్టీ పరంగా కాకుండా ఆయా నాయకుల వ్యక్తిగత స్థాయిలోనే ఉన్నాయి. బీజేపీ తెలంగాణ నాయకులు బండి సంజయ్ వంటి వారు చంద్రబాబు అరెస్టును ఖండించినా.. ఆ పార్టీ అధినాయకత్వం మాత్రం కనీసం స్పందన కూడా లేకుండా ఉండిపోయింది. అలాగే  తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లో కూడా కొందరు నేతలు చొంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ప్రకటనలు చేయడమే కాకుండా ప్రత్యక్ష ఆందోళనల్లో కూడా పాల్గొన్న.. ఆ పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడకు కేటీఆర్ మాత్రం స్పందించలేదు. హైదరాబాద్ ప్రగతిలో, పురోగతిలో అడుగడుగునా చంద్రబాబు ముద్రలు కనిపిస్తుంటాయని గతంలో స్వయంగా చెప్పిన కేటీఆర్.. ఏపీలో చంద్రబాబును అరెస్టు చేస్తే తెలంగాణలో ఆందోళనలేమిటి? అంటూ మీడియా సమావేశంలో రుసరుసలాడారు కూడా.  ఆయన ఒక్క మాటతో తెలంగాణలోని ఆంధ్రసెటిలర్స్  భగ్గుమన్నారు. అప్పటి వరకూ తటస్థంగా ఉన్న వారు కూడా చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు సంఘీభావం ప్రకటించారు. ఈ పరిస్థితితో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఒక్క సారిగా మారిపోయాయి. అంత వరకూ త్రిముఖ పోటీగా ఉన్న పరిస్థితి ఒక్క సారిగా ముఖాముఖీగా మారిపోయింది. చంద్రబాబు అరెస్టుకు ముందు వరకూ పోటీలో ఉన్నట్లుగా కనిపించిన బీజేపీ సోదిలోకి లేకుండా పోయిన పరిస్థితి ఏర్పడిందని పరిశీలకులు అంటున్నారు. మోడీ మహబూబ్ నగర్ సభకు బీజేపీ సీనియర్లే డుమ్మా కొట్టారంటే ఆ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిపోయిందో ఇట్లే అవగతం చేసుకోవచ్చు. 

అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం అనూహ్యంగా బలోపేతమైంది. రాష్ట్రంలో కనీసంలో కనీసం 40 నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేయడమే కాకుండా.. పాతిక స్థానాలలో విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో తప్పులో కాలేసినట్లు గ్రహించిన చంద్రబాబు అరెస్టు విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోకపోయినా గొంతు సవరించుకున్నారు. అలాగే మంత్రి హరీష్ రావు కూడా చంద్రబాబు అరెస్టుతో మాకేం సంబంధం అనడం నుంచి చంద్రబాబు అరెస్టు దురదృష్టకరం అంటూ మాట మార్చారు. అయితే అప్పటికే నివారించడానికి వీలు లేనంత నష్టం జరిగిపోయింది, తటస్థులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పోలరైజ్ అయిపోయారు. చంద్రబాబు అరెస్టుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధిని, అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ ను నిలబెట్టిన విధానాన్నీ గుర్తు చేయడమే కాదు. అటువంటి నాయకుడి అరెస్టును ఖండిచే పాటి సంస్కారం, ధైర్యం లేని కేసీఆర్ పట్ల తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ముఖాముఖీ పోరు అనివార్యమైన పరిస్థితుల్లో తెలుగుదేశం పట్ల వ్యక్తమౌతున్న సానుకూలత బీఆర్ఎస్ కు తేరుకోలేని నష్టం చేకూర్చడం తథ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. జగన్ పట్ల వ్యతిరేకత చంద్రబాబు అరెస్టుకు ముందునుంచీ ఉన్నప్పటికీ ఆయన అక్రమ అరెస్టుతో ఒక్కసారిగా అది ద్విగుణీకృతం, అంతకంటే ఎక్కవ అయ్యిందని అంటున్నారు. ముఖ్యంగా తటస్థలు చంద్రబాబు అరెస్టుతో ఒక నిర్ణయం తీసేసుకున్నారనీ, చంద్రబాబు అరెస్టుకు ముందు వరకూ తటస్థుల మొగ్గు ఎటువైపు అన్న విషయంలో స్పష్టత లేదనీ, ఇప్పుడు స్పష్టత వచ్చేయడంతో అధికార పక్షానికి వచ్చే ఎన్నికలలో గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయమనీ అంటున్నారు. అరెస్టుకు ముందు వరకూ తటస్థుల మొగ్గుతో సంబంధం లేకుండా వైసీపీ ఓటమి ఖాయమన్న విశ్లేషణలు చేసిన పరిశీలకులు అరెస్టు తరువాత తటస్థుల మొగ్గు తెలుగుదేశం వైపే అని ఖరారు కావడంతో అధికార పార్టీ పని ఇక అయిపోయినట్లేనని చెబుతున్నారు. పోలింగ్ రోజున ఎటు మొగ్గు చూపితే ఆటే గెలుపు.