Leading News Portal in Telugu

ఏపీ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలు..


posted on Oct 11, 2023 3:07PM

ఎపి హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొలిజియం చేసిన సిఫారసుల మేరకు 

ఏపీ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలు రాబోతున్నారు. సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఏపీ హైకోర్టు జడ్జిలుగా నలుగురిని సిఫారసు చేసింది. జస్టిస్ హరినాథ్, జస్టిస్ ఎం. కిరణ్మయి, జస్టిస్ జె.సుమతి, జస్టిస్ ఎన్.విజయ్ లను హైకోర్టు జడ్జిలుగా కొలీజియం సిఫారసు చేసింది. త్వరలోనే ఈ నలుగురు న్యాయమూర్తులు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల ఏపీ హైకోర్టు నుంచి పలువురు న్యాయమూర్తుల బదిలీపై వెళ్లడం తెలిసిందే.

ఈ నలుగురు గతంలో న్యాయవాదులుగా వ్యవహరించారు. వీరిని జడ్జిలుగా నియమించాలని ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇద్దరు సీనియర్ జడ్జిలు సంప్రదింపులు జరిపి, ఆ మేరకు ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలకు ఏపీ సీఎం జగన్, గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. ఆ నలుగురి అర్హతలు గుర్తించిన సుప్రీంకోర్టు కూడా వారిని న్యాయమూర్తులుగా నియమించవచ్చంటూ తాజాగా సిఫారసు చేసింది.