Leading News Portal in Telugu

లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ విజయవంతం


posted on Oct 14, 2023 1:24PM

మాజీ ముఖ్యమంచంద్రబాబు అరెస్ట్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ హస్తం ఉందా? అవుననే వ్యవహరించింది ఇవ్వాళ తెలంగాణ సర్కార్. ఐటీ ఉద్యోగులు పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమానికి  తెలంగాణ ప్రభుత్వం అడుగడుగునా అవాంతరాలు కల్గించింది. అయినప్పటికీ లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ విజయవంతం అయ్యింది. మియాపూర్ టు ఎల్బీనగర్ వరకు ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున నల్ల టీ షర్ట్ లు ధరించడంతో నల్ల ప్రవాహం పారినట్లు అనిపించింది. 

స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో అరెస్ట‌యి రాజమండ్రి సెంట్ర‌ల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు మద్ద‌తుగా హైద‌రాబాద్‌లోని టీడీపీ శ్రేణులు, అభిమానులు వినూత్న నిర‌స‌న‌కు పిలుపునిచ్చారు. `లెట్స్ మెట్రో ఫ‌ర్ సీబీఎన్` పేరుతో శ‌నివారం నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. హైద‌రాబాద్ మెట్రో రైల్ ఇందుకు వేదిక అయ్యింది. న‌ల్ల‌ టీష‌ర్టుల‌తో మియాపూర్ టు ఎల్బీన‌గ‌ర్‌ శ‌నివారం ఉద‌యం 10.30 నుంచి 11.30 గంట‌ల మ‌ధ్య ఎల్బీన‌గ‌ర్ వ‌ర‌కు న‌ల్ల టీష‌ర్టులు ధ‌రించి మెట్రోలో  టీడీపీ నాయ‌కులు, అభిమానులు ప్రయాణించారు. మియాపూర్ నుంచి ఎల్బీన‌గ‌ర్ వ‌ర‌కు  మెట్రో ఎక్కి తమ  నిర‌స‌న‌ తెలియజేశారు. మెట్రో ప్ర‌యాణికుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా   ఆందోళన కారులు శాంతియుతంగా నిర‌స‌న  తెలిపారు.

 అయితే హైదరాబాద్ లో ఆకస్మికంగా మెట్రో రైళ్లను పోలీసులు ఆపేశారు.  మెట్రోస్టేషన్లలో బ్లాక్ టీషర్ట్స్ ధరించిన వారిని వెనక్కి తిప్పి పంపించారు.చంద్రబాబు అరెస్టుకు నిర‌స‌న‌గా ఇవ్వాళ  ఐటీ ఉద్యోగులు  పెద్ద సంఖ్యలో  కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. శ‌నివారం సెల‌వు దినం కావ‌డంతో ఈ నిర‌స‌న‌లో ఐటీ ఉద్యోగులే ఎక్కువ మంది పాల్గొన్నారు.  హైదరాబాద్‌లో మెట్రో ఏర్పాటుకు చంద్రబాబు దార్శ‌నిక‌త కూడా కార‌ణ‌మ‌ని, అందుకే ఈ నిర‌స‌న‌ను ఎంచుకున్న‌ట్లు పార్టీ కార్య‌క‌ర్త‌లు చెబుతున్నారు.