Leading News Portal in Telugu

మేనిఫెస్టోలో హామీల సునామీ | promises in brs manifesto| kcr| arogyabhima| kcr| bhima| sowbhagyalakshmi| telangana


posted on Oct 16, 2023 5:59AM

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో రాజకీయం హీటెక్కింది. షెడ్యూల్ విడుదలకు ముందే  రాష్ట్రంలోని 119 స్థానాలలో 115 స్థానాలలో పార్టీ అభ్యర్థులను ప్రకటంచి దూకుడు ప్రదర్శించిన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. ఆ తరువాత ఎందుకో నెమ్మదించారు. అయితే తాజాగా  ఆదివారం (అక్టోబర్ 15) బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను తలదన్నేలా ఈ మేనెఫెస్టోను రూపొందించారు.  హ్యాట్రికగ్ గెలుపే లక్ష్యంగా  కేసీఆర్  ఈ మేనిఫెస్టోలో కేసీఆర్ హామీల వర్షం కురిపించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు ఇవే..

# హైదరాబాదులో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు  

# అనాథ బాలల కోసం   అర్బన్ పాలసీ

# అసైన్డ్ భూములపై ఆంక్షల ఎత్తివేత

# ఆహాక భద్రత కార్డు హోల్డర్లందరికీ ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి.. రూ.5 లక్షలతో బీమా సౌకర్యం… 

# సౌభాగ్యలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేల చొప్పున పెన్షన్

# తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు కేసీఆర్ బీమా పథకం

# అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్

# పేద మహిళలకు రూ.400కే గ్యాస్ సిలిండర్

# జర్నలిస్టులకు రూ.15 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు

# ఆరోగ్యశ్రీ బీమా మొత్తం రూ.15 లక్షలకు పెంపు

# దివ్యాంగులకు పెన్షన్ రూ.6 వేలకు పెంపు

# సాధారణ మరణానికి కూడా కేసీఆర్ బీమా వర్తింపు

# తెలంగాణ అన్నపూర్ణ’ పథకం తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు సన్న బియ్యం…

# ఆసరా పింఛన్ల మొత్తం దశలవారీగా పెంపు

# పింఛన్లు ఏడాదికి రూ.500 చొప్పున రూ.5 వేల వరకు పెంపు

# రైతు బంధు దశలవారీగా రూ.16 వేల వరకు పెంపు

# కౌలు రైతులకు ఆర్థిక సహాయం

# వ్యవసాయ స్థిరీకరణ కొనసాగింపు