posted on Oct 24, 2023 9:20AM
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. సోమవారం శ్రీవారిని 79వేల 693 మంది దర్శించుకున్నారు.
వారిలో 21 వేల 864 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకలు 2 కోట్ల 38 లక్షల రూపాయలు వచ్చాయి. ఇక మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోవడానికి వేచి ఉన్న భక్తులతో 10 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.