గోరంట్ల మాధవ్ చేతలే కాదు..మాటలు కూడా ఛండాలమే! | gorantla madhav untoward comments on babu| ycp| busyatra
posted on Oct 28, 2023 1:47PM
ఎన్నికలు వస్తున్నాయంటే.. టైగర్‌కే కాదు.. ఘర్ కా టైగర్‌కి సైతం టైమొచ్చేస్తోంది. అందుకు తాజా ఉదాహరణ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం. అధికార వైసీపీ చేపట్టిన సాధికార బస్సు యాత్రలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. వచ్చే సాధారణ ఎన్నికల్లో జగన్ తిరిగి సీఎం అవ్వడం.. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చావడం ఖాయమని వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించిన వీడియో అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
2019 ఎన్నికలకు ముందు ప్రెస్‌మీట్‌లో సీఐ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. మీసం తిప్పి.. నాటి అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి సవాల్ విసరడం ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారని.. ఆయనలోని టాలెంట్‌ని నాడే జగన్ గుర్తించి.. పార్టీలోకి ఆహ్వానించి.. కండువా కప్పారని.. అలా ఎంపీగా గెలిచారని.. అయితే గతేడాది గోరంట్ల మాధవ్.. నగ్న వీడియో బైటకు వచ్చి.. విపరీతంగా వైరల్ అయిందని.. దీంతో మాధవుడిలోని టాలెంట్ ప్రపంచమంతా చూసిందని.. దాంతో ఈ మాధవుడు మామూలోడు కాదని ప్రపంచమంతటికీ బాగా అర్థమైందని.. అంటే.. సీఐగా ప్రెస్‌మీట్ పెట్టి మీసం తిప్పాడని.. ఎంపీ అయిన తర్వాత బట్టలు విప్పాడని నెటిజన్లు ఈ సందర్భంగా గోరంట్ల మాధవ్‌పై సెటైర్లు సంధిస్తున్నారు.
వైసీపీ నేతలంతా అంటే.. నాని బ్రదర్స్, అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, జోగి రమేష్, గోరంట్ల మాధవ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అంతా ఇంతేనా కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. అదీకాక వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌కి ఏం ఇష్టమో.. వీరందరికీ బాగా తెలుసునని.. ఆ క్రమంలో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, జనసేనాని పవన్ కల్యాణ్‌లను టార్గెట్ చేసి.. వీరంతా వారిపై బూతులతో విరుచుకు పడిపోతారని.. అలా అయితేనే తమకు మంత్రి పదవి దక్కుతుందన్న భావనలో ఉండటం వల్లే అలా వ్యవహరిస్తున్నారని.. పేర్కొంటున్నారు.
అయితే ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశాలు, బహిరంగ సభల్లో సీఎం జగన్ సైతం ప్రతిపక్ష పార్టీల నేతల వ్యక్తిగత జీవితాన్ని టచ్ చేస్తారని.. మరి ఆ సమయంలో ఆయనకు.. తన ఫ్యామిలీ గురించి కానీ.. జగనన్న వదిలిని బాణం వైయస్ షర్మిల ఫ్యామిలీ గురించి కానీ.. వాళ్ల తాతా రాజారెడ్డి ఫ్యామిలీ గురించి కానీ గుర్తుకు రాదా అనే సందేహాన్ని మరో నెట్‌జన్ వ్యక్తం చేశారు.
మరో నెటిజన్ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారని.. ఆయన ఆరోగ్యంపై జైలు అధికారులు విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్‌లో అంతా బాగానే ఉందని చెబుతున్నారని.. కానీ కోర్టు ఆదేశాలతో ఇటీవల చంద్రబాబును ఐదుగురు వైద్యులు పరీక్షించి.. ఆయనకు కీలక వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారని.. అందుకు సంబంధించిన నివేదికను చంద్రబాబు భార్య నారా భువనేశ్వరికీ అందించారని.. సదరు నివేదికలో బాబు ఆరోగ్యం కొంత ఆందోళనకరంగా ఉందని తెలిపారని.. దీంతో చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన ఫ్యామిలీలోనే కాదు… పార్టీ శ్రేణుల్లో , జనంలో సైతం తీవ్ర ఆందోళన నెలకొందని.. అటువంటి వేళ.. ఓ బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా గోరంట్ల మాధవ్ ఇలా మాట్లాడడం సరికాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదీకాక గోరంట్ల మాధవ్.. పూర్వాశ్రమంలో పోలీస్ శాఖలో సీఐగా బాగానే లాఠీ తిప్పారని అంటే… క్రమశిక్షణకు చిరునామాగా నిలవాల్సిన ఖాకీవనం నుంచి వచ్చిన ఆయన ఇలా వ్యవహరించడం.. ఆ శాఖకే కాదు.. ఆయన పార్టీకి సైతం సిగ్గు చేటని అంటున్నారు.
మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి. మళ్లీ ఎంపీ సీటో, ఎమ్మెల్యే సీటో దక్కించుకోవాలంటే.. ఇటువంటి వ్యాఖ్యలు చేయాలని.. ఆ వ్యాఖ్యలతో జగనన్న కళ్లలో ఆనందం.. మంత్రి అంబటి రాంబాబు డ్యాన్స్ చేసినట్లు నాట్యం చేస్తుందని ఇంకో నెటిజన్ సెటైరికల్‌గా అన్నారు. పార్టీ అధినేత, సీఎం జగన్ కళ్లలో ఆనందం కోసం.. ఈ నేతలంతా ఏమైనా చేస్తారని.. ఎంతకైనా తెగిస్తారని.. యథా పార్టీ అధినేత.. తథా ఆయన అనుచరగణమని మరో నెటిజన్ పేర్కొనడం గమనార్హం.
అయినా.. ఇన్ని చెబుతున్నా.. గోరంట్ల మాధవ్.. తన నగ్న వీడియో నిజమైనదో కాదో మాత్రం చెప్పడం లేదని… ఆయన వీడియో హల్ చల్ చేసిన తర్వాత… చాలా కాలం బయట ఎక్కడా కనిపించని.. ఈ హిందూపురం ఎంపీగారు.. మళ్లీ ఇలా.. ఎన్నికల వేళ.. మైకు ముందు రెచ్చిపోతున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.