Leading News Portal in Telugu

చంద్రబాబుకు మధ్యంతర బెయిలు.. స్వాగతించిన పురంధేశ్వరి | purandeswari welcomes chandrababu bail| arrest| not| correct| fir| name| notice


posted on Oct 31, 2023 12:13PM

స్కిల్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయనకు హైకోర్టు నాలుగు వారాల మధ్యంత బెయిలు మంజూరు చేసింది.

కాగా చంద్రబాబుకు మధ్యంతర బెయిలును బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్వాగతించారు. అసలు చంద్రబాబును అరెస్టు చేసిన తీరునే తాము తప్పుపట్టిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా, కనీసం విచారించకుండా, చివరాఖరికి ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా చంద్రబాబు అరెస్టు చేసిన విధానమే కరెక్ట్ కాదని ఈ సందర్భంగా పురంధేశ్వరి పేర్కొన్నారు.