Leading News Portal in Telugu

కాంగ్రెస్ నేతల ఇళ్లు , కార్యాలయాలపై ఐటీ సోదాలు


posted on Nov 2, 2023 12:30PM

అధికారంలో ఉన్న పార్టీలు ప్రత్యర్థి పార్టీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం కామన్. అయితే  తెలంగాణలో పోలింగ్ కు నెల రోజుల వ్యవధి కూడా లేదు.  సందట్లో సడేమియా అన్నట్టు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టడానికి ప్లాన్ చేసింది. తెలంగాణలో బిజెపి బి టీం  బిఆర్ఎస్ అనే ప్రచారం ఉండనే ఉంది. శత్రువు శత్రువు మిత్రుడు అన్న చాణక్య రాజనీతిని కేంద్ర సర్కార్ వ్యవహరిస్తోంది. ఇందుకు బిఆర్ఎస్ సహకారం తీసుకుంటుంది. ఆ పార్టీ  సూచించిన కాంగ్రెస్ నేతల ఇళ్లు , కార్యాలయాలపై కేంద్ర ఇంటెలిజెన్స్ దాడులు చేస్తోంది. గురువారం (నవంబర్ 1)కాంగ్రెస్ నాయకురాలు చిగిరింత పారిజాత ఇళ్లలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఈ ఉదయం ఐదు గంటల సమయంలో హైదరాబాద్ శివారులోని బాలాపూర్‌లోని ఆమె నివాసంతోపాటు మరో 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలకు దిగారు. ఈ క్రమంలో పారిజాత కుమార్తె ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. బడంగ్‌పేట్ మేయర్ అయిన పారిజాత ఇల్లుతోపాటు కంపెనీలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేలంలో బాలపూర్ లడ్డూను దక్కించుకున్న బీఆర్ఎస్ నేత వంగేటి లక్ష్మారెడ్డి, మహేశ్వరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అలాగే, మరికొందరి ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ తనిఖీలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార, విపక్ష నాయకుల ఇళ్లలో సోదాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.