Leading News Portal in Telugu

బాబు క్వాష్ పిటిషన్.. సుప్రీం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ | supreme verdict on babu quash petetion| skill| scam| 17a| apcid| acb


posted on Nov 8, 2023 11:49AM

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు బుధవారం(నవంబర్8) తీర్పు వెలువరించే అవకాశాలు ఉన్నాయి. స్కిల్ కేసులో  జగన్ సర్కార్ చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 52 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ లో ఉన్న  చంద్రబాబు.. తాను ఎటువంటి తప్పూ చేయలేదనీ, తనపై కేసు రాజకీయ ప్రేరేపితమనీ, రాజకీయ కక్ష సాధింపులో భాగమని పేర్కొంటూ క్వాష్ చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు ఆయన క్వాష్ పిటిషన్ ను కొట్టివేశాయి.

దీంతో ఆయన సుప్రీం ను ఆశ్రయించారు. సుప్రీంలో సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పు రిజర్వ చేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు బుధవారం (నవంబర్8)న వెలువడనుంది. ఈ తీర్పు పై ఏపీలోనే కాదు.. దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. చంద్రబాబు క్వాష్ ను సుప్రీం అనుమతిస్తే.. స్కిల్ కేసే కాదు.. ఆయనపై జగన్ సర్కార్ నమోదు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, ఇసుక, మద్యం పాలసీ ఇలా అన్ని కేసులూ రద్దౌతాయి. ఒక వేళ సుప్రీం కోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ ఆయన సీజేఐ ధర్మాసనాన్ని ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబుకు అనుకూలంగా సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం సీజేఐ ధర్మాసనాన్ని ఆశ్రయింస్తుందని అంటున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన ఏపీ సీఐడీ.. ఈ కేసులో చంద్రబాబు పాత్రకు సంబంధించి ఇప్పటి వరకూ ఒక్క ఆధారం కూడా చూపలేకపోయింది.  

స్కిల్ సెంటర్ల ఏర్పాటు, వాటిలో మౌలిక సదుపాయాలు, సాఫ్ట్ వేర్ వంటి అంశాలను కూడా పరిగణనలోనికి తీసుకోలేదు. అసలు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా చూపని సీఐడీ.. స్కాం జరిగింది. ఎలా జరిగింది? చంద్రబాబు పాత్ర ఉందా లేదా? అన్నది ఆయనను అరెస్టు చేశాం కనుక ఆయనను ప్రశ్నించి రాబడతామని చెబుతోంది.  ఇలా ఉండగా న్యాయనిపుణులు మాత్రం ఈ కేసులో చంద్రబాబుకు 17ఏ సెక్షన్ వర్తిస్తుందని స్పష్టంగా చెబుతున్నారు.  

ఇక పోతే సుప్రీంలో ఈ కేసు విచారణ సందర్భంగా.. ఆధారాలు లేకుండా కేసు పెట్టి అక్రమంగా ఆయనను అరెస్టు చేశారని ఇన్ని రోజులుగా   ప్రభుత్వ న్యాయవాదుల పసలేని వాదనతో నిర్ద్వంద్వంగా తేలిపోయింది. తొలుత అర్ధరాత్రి ఆయనను చుట్టుముట్టి అరెస్టు చేసినప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలూ ఉలిక్కిపడ్డాయి. ఆ తరువాత తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. దేశ విదేశాలలో తెలుగువారున్న ప్రతి చోటా ఆందోళనలు మిన్నంటాయి. నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. బెయిలు తీసుకుని బయటకు రావడం కాకుండా అసలు తన అరెస్టు, తనపై కేసే తప్పని చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేశారు. ఏసీబీ కోర్టు, హైకోర్టులలో క్వాష్ పిటిషన్ ను కొట్టివేసినా ఆయన దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తున్నారు. అక్కడ చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ప్రభుత్వ న్యాయవాదులు, చంద్రబాబు న్యాయవాదులు తమతమ వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టులో ప్రభుత్వ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న వారంతా  ఇంత అడ్డగోలుగా  ఒక ప్రజా ప్రతినిథిని అరెస్టు చేసేయొచ్చా అని ఆశ్చర్యపోతున్నారు.

ఆధారాలు చూపమని న్యాయస్థానం ఆదేశిస్తే.. ఆ ఒక్కటీ  అడక్కండి అన్నట్లుగా ఏపీ  సర్కార్ తరఫున వాదించిన ముకుల్ రోహత్గీ  వాదనలు ఉన్నాయంటున్నారు. అవినీతి జరిగింది. దానిలో  చంద్రబాబు  పాత్ర ఉందా లేదా అన్నది ఆయనను విచారించి  తెలుసుకుంటాం అన్నట్లుగా ముకుల్ రోహత్గీ చెబుతున్నారు. ఇక చంద్రబాబు అరెస్టు అక్రమమనీ, ఆయనను విచారించాలన్నా, అరెస్టు చేయాలన్నా గవర్నర్ అనుమతి తీసుకోవడం తప్పని  సరి  అనీ  చంద్రబాబు  తరఫు న్యాయవాది హరీష్ సాల్వే  కోర్టుకు తెలిపారు. 17ఏ సెక్షన్ చంద్రబాబుకు వర్తిస్తుందని చెబుతూ అందుకు ఉదాహరణగా పలు కేసులలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పులను ఉటంకించారు. పలు సందర్భాలలో హరీష్ సాల్వే వాదనలతో న్యాయమూర్తులు ఏకీభవించారు. ఒక సందర్భంలో అయితే ఈ కేసులో చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందని అనిపిస్తోందని కూడా న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు పట్ల సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది.