Leading News Portal in Telugu

తెలంగాణ ఎన్నికల్లో జనసేన 8  స్థానాలు ఖరారు


posted on Nov 8, 2023 10:22AM

తెలంగాణ ఎన్నికల్లో బిజెపి, జనసేన కల్సి పోటీ చేస్తున్నాయి. పొత్తు, సీట్ల సర్దుబాటు విషయంలో ఇరు పార్టీలు ఒక అవగాహనకు వచ్చి జన సేనకు 8 సీట్లు కేటాయించాలని బిజెపి నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో జనసేన పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి అడుగులు వేస్తున్నాయి. బీజేపీ ఇప్పటికే 100 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. జనసేనకు పొత్తులో భాగంగా ప్రస్తుతానికి ఎనిమిది స్థానాలను బీజేపీ కేటాయించింది. మరికొన్ని స్థానాలపై చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను జనసేన విడుదల చేసింది.

జనసేన పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులు ఇవే

కూకట్‌పల్లి నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్,

 తాండూరు – నేమూరి శంకర్ గౌడ్,

 కోదాడ – మేకల సతీష్ రెడ్డి,

 నాగర్ కర్నూలు – వంగ లక్ష్మణ్ గౌడ్,

 ఖమ్మం – మిర్యాల రామకృష్ణ,

 కొత్తగూడెం – లక్కినేని సురేందర్ రావు, 

వైరా (ఎస్టీ) – డాక్టర్ తేజావత్ సంపత్ నాయక్,

 అశ్వారావుపేట (ఎస్టీ) – ముయబోయిన ఉమాదేవి పోటీ చేయనున్నారు.